‘ఇది ఉత్తరప్రదేశ్ కాదని CM రేవంత్ రెడ్డికి చెప్పండి’.. మీనాక్షి నటరాజన్‌కు హరీష్ రావు ట్వీట్

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ బుల్డోజర్ పాలనపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘ఇది ఉత్తరప్రదేశ్ కాదని CM రేవంత్ రెడ్డికి చెప్పండి’.. మీనాక్షి నటరాజన్‌కు హరీష్ రావు ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ బుల్డోజర్ పాలనపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మీడియా వేదికగా కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్‌కు(Meenakshi Natarajan) హరీష్ రావు ట్వీట్ చేశారు. పేదలు, మధ్య తరగతి ఇండ్లపై హైడ్రా అరాచక రాజ్యం కొనసాగించడం దుర్మార్గమని పేర్కొన్నారు. హైకోర్టు స్టే విధించినా.. ఇళ్ల కూల్చివేతకు పాల్పడటం న్యాయవ్యవస్థను అవమానించడమే అని అన్నారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వానికి న్యాయస్థానాలపై ఉన్న గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకొని ఒక్క ఇంటిని కూడా వదలకుండా నేలమట్టం చేయడం హైడ్రా అధికారులకు సరికాదు.. ఇది అమానుష ఘటన అని అన్నారు.

‘‘సామాన్లు తీసుకుపోతాం.. సమయం ఇవ్వండి’ అని పేదలు వేడుకున్నా కనికరం లేకుండా బుల్డోజర్లు ఇండ్లకు మీదకు నడపడం అమానవీయం. ఉత్తర ప్రదేశ్‌లో బిజేపీ చేస్తున్న బుల్డోజర్ రాజ్‌కు దీటుగా తెలంగాణలో బుల్డోజర్ రాజ్ నడిస్తున్నారు. ఒకవైపు ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా బుల్డోజర్ రాజ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ, “మోహబ్బత్ కి దుకాన్” అంటూ ప్రేమ సందేశాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే.. మరోవైపు అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి మాత్రం బుల్డోజర్ రాజ్ చేస్తూ పేదల గూడు కూల్చుతున్నడు. ఇది కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా?’ అని హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ సీఎం‌ను రాజ్యాంగ విలువలకు, కాంగ్రెస్ పార్టీ చెబుతున్న సిద్ధాంతాలకు లోబడి నడుచుకునేలా ఆదేశించాలని మీనాక్షి నటరాజన్‌ను హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్‌ తరహా బుల్డోజర్ రాజ్‌ను తెలంగాణలో నడపవద్దని రేవంత్ రెడ్డికి సూచించాలని కోరారు.

Next Story