- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ అభ్యర్థులకు హరీష్ రావు అడ్వాన్స్ కంగ్రాట్స్..
మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా స్పందిచారు.

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్(Municipal Election Polling)పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) సోషల్ మీడియా వేదికగా స్పందిచారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలుకొని.. మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు అడుగడుగునా అధికార దుర్వినియోగానికి, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడటం దుర్మార్గం. నామినేషన్ల దాఖలు మొదలు పోలింగ్ వరకూ కాంగ్రెస్ అనేక అరాచకాలకు పాల్పడటం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బెదిరించడమే గాక, వారిపై భౌతిక దాడులకు తెగబడటం హీనమైన రాజకీయ సంస్కృతికి నిదర్శనం. చట్టాన్ని సైతం లెక్కచేయకుండా.. అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తిన కొందరు పోలీసుల తీరు గర్హనీయం. ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ ఇలాంటి నీచ రాజకీయాలకు తెగబడటం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమే.
కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలు, డబ్బు సంచులు, దుష్ట పన్నాగాలు ప్రజల తీర్పును ఏమాత్రం ప్రభావితం చేయలేవు. అధికార పార్టీ ఆకృత్యాలకు అదరకుండా, బెదరకుండా BRS పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చివరి వరకు కృషి చేసిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇన్‌చార్జ్‌లకు అభినందనలు. శుభాకాంక్షలు. బీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో తమ అమూల్యమైన ఓటు వేసిన ప్రతి ఓటరుకు హృదయ పూర్వక ధన్యవాదాలు’’ అని హరీష్ రావు పేర్కొన్నారు.






