Harish Rao : గొంగడి త్రిషకు హరీష్ రావు స్పెషల్ విషెస్

by Muthe.Rajitha |

ఐసీసీ అండ‌ర్ -19 టీ20(ICC U19 Women's T20) వ‌ర‌ల్డ్ క‌ప్(World Cup) విజేతగా నిలిచిన టీమిండియా(Team Inida) జ‌ట్టుకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు(Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు.

Harish Rao : గొంగడి త్రిషకు హరీష్ రావు స్పెషల్ విషెస్
X

దిశ, వెబ్ డెస్క్ : ఐసీసీ అండ‌ర్ -19 టీ20(ICC U19 Women's T20) వ‌ర‌ల్డ్ క‌ప్(World Cup) విజేతగా నిలిచిన టీమిండియా(Team Inida) జ‌ట్టుకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు(Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజ‌యం భార‌త‌దేశానికి ఎంతో గ‌ర్వకార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. ఈ గెలుపు మహిళా క్రీడాకారిణుల ప్రతిభ‌, కృషి, దృఢ సంక‌ల్పాన్ని లోకానికి ఛాటి చెబుతుంది అన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ, భద్రాచలం యువతి గొంగ‌డి త్రిష‌(Gongadi Trisha).. ఈ టోర్నీలో 300 కంటే ఎక్కువ ప‌రుగులు చేయ‌డ‌మే కాకుండా 10 వికెట్లు తీసి అద్భుత‌మైన ప్రద‌ర్శన కనబరిచి, రాష్ట్రానికి గొప్ప పేరు తెచ్చిందన్నారు. ఈ సందర్భంగా త్రిషకు హరీష్ రావు ప్రత్యేక అభినంద‌న‌లు తెలియ జేశారు. గొంగ‌డి త్రిష తెలంగాణ భ‌విష్యత్ త‌రాల‌ క్రీడాకారిణులకు ఆదర్శంగా నిలుస్తుంద‌ని పేర్కొన్నారు.

అయితే మహిళల అండ‌ర్-19 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. ఆదివారం సౌతాఫ్రికా(South Africa)తో జరిగిన ఫైనల్​లో భారత్ 9 వికెట్ల తేడాతో విజ‌యం సాధించి విశ్వవిజేత‌గా నిలిచింది. సఫారీ జట్టు నిర్దేశించిన 83 పరుగుల లక్ష్యాన్ని, టీమిండియా అమ్మాయిలు 11.2 ఓవర్లలో 1 వికెట్​ కోల్పోయి ఛేదించారు. గొంగడి త్రిష 33 బంతుల్లో 44 ప‌రుగులు (8×4) చేసి నాటౌట్‌గా నిలిచింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్ల విజృంభనతో సఫారీ జట్టు విలవిల్లాడింది. మికీ వాన్ (23)​. నలుగురు ప్లేయర్లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. భార‌త జ‌ట్టు బౌలర్లలో త్రిష 3, పరునిక, ఆయూషి, వైష్ణవి తలో 2, షబ్నమ్ 1 వికెట్ తీశారు. కాగా భారత మహిళల జట్టుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story