డోస్ పెంచిన హరీష్ రావు.. రేవంత్ సర్కార్‌పై ఘాటు వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

తెలంగాణలో గతకొన్ని రోజులుగా ఎరువుల కొరత ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

డోస్ పెంచిన హరీష్ రావు.. రేవంత్ సర్కార్‌పై ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గతకొన్ని రోజులుగా ఎరువుల కొరత ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వెంటనే అప్రమత్తమై.. కేంద్ర పెద్దలతో సమావేశం అయ్యారు. తెలంగాణకు కేటాయింపులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కేంద్రమంత్రి సైతం స్పందించి.. పెంచుతామని హామీ ఇచ్చారు. అయితే తాజాగా యూరియా(Urea) కోసం రైతులు రోడ్డెక్కారు. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కీలక పోస్టు పెట్టారు. ‘‘మహబూబాబాద్ జిల్లా గూడూరులో యూరియా కోసం రైతులు అవస్థ పడుతున్నారు. ముసురు వానలో రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. యూరియా కూడా సరఫరా చేయలేని దిక్కుమాలిన ప్రజాపాలన ఇది. అభయహస్తం కాదు.. రైతన్నల పాలిట భస్మాసుర హస్తం అయ్యింది కాంగ్రెస్ ప్రభుత్వం’ అని హరీష్ రావు ఘాటు ట్వీట్ పెట్టారు.

Next Story