Harish Rao: కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే.. రేవంత్ రెడ్డి బూతుపిత

by Gantepaka Srikanth |   (  Updated:2025-03-16 10:19:45  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్(BRS) నేత హరీష్ రావు(Harish Rao) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Harish Rao: కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే.. రేవంత్ రెడ్డి బూతుపిత
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్(BRS) నేత హరీష్ రావు(Harish Rao) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ నుంచి ఏకపక్షంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) సస్పెండ్ చేశారని అన్నారు. కేసీఆర్(KCR) పదేళ్ల పాటు తెలంగాణను నెంబర్ వన్ స్టేట్‌గా నిలిపారు. దేశానికి ఆదర్శం చేశారు. అలాంటి వ్యక్తి చావు కోరుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న సంస్కారానికి అద్దం పడుతోందని తెలిపారు. కేసీఆర్‌ను మార్చురీకి పంపాలని స్వయంగా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జానారెడ్డి(Jana Reddy)కి కేసీఆర్ ఎంతో గౌరవం ఇచ్చారు.. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్‌కు ఇదేనా? రేవంత్ రెడ్డి ఇచ్చే రెస్పెక్ట్ అని సీరియస్ అయ్యారు.

రేవంత్ రెడ్డి వ్యక్తిత్వహనానికి పాల్పడుతున్నారని అన్నారు. కేసీఆర్ చావు కోరుకునేలా నిండు అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. వెంటనే ఆయన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఎల్‌ఆర్ఎస్ ఉచితంగా కట్టాలని కాంగ్రెస్ నేతలు చెప్పారు.. అధికారంలోకి వచ్చాక మాట మార్చి.. ఎల్ఆర్ఎస్(LRS) కట్టి తీరాలని డబ్బులు చేయడం దారుణమని మండిపడ్డారు. తెలంగాణ జాతిపతిగా కేసీఆర్ పేరు తెచ్చుకుంటే.. తెలంగాణ బూతుపితగా రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నారని విమర్శలు చేశారు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్‌గానూ పేరు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు.

Read More..

ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి మంత్రి శ్రీధర్ బాబుకు పిలుపు..

Next Story