- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ పాపంలో కిషన్ రెడ్డికి కూడా పాత్ర: హరీష్ రావు సంచలన ట్వీట్
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి హరీష్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి హరీష్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘ఇవాళ రాజ్యసభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్దాలతో, చరిత్ర వక్రీకరణలతో తన లోపలి వికృతత్వాన్ని బయట పెట్టుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయక వెన్నుచూపి పారిపోయిన కిషన్ రెడ్డి నేడు పార్లమెంట్ సాక్షిగా మరోసారి ద్రోహానికి పాల్పడ్డాడు. ఏడు మండలాలను ఏపీకి అప్పగించాలనేది విభజన చట్టంలో ఉందని కిషన్ రెడ్డి పేర్కొనడం చారిత్రక అవాస్తవమే కాదు.. తెలంగాణకు చేస్తున్న తీరని ద్రోహం. విభజన చట్టానికి సవరణ తెచ్చి ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలను ఏపీకి కట్టబెట్టింది ముమ్మాటికి బీజేపీ ప్రభుత్వమే.
పాపంలో కిషన్ రెడ్డికి కూడా పాత్ర..
ఈ పాపంలో కిషన్ రెడ్డికి కూడా పాత్ర ఉంది. ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్.. తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చి మీరు చేసిన ద్రోహాన్ని ఎండగట్టిన విషయాన్ని మర్చిపోయి నేడు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంట అన్నట్లు చరిత్రను వక్రీకరిస్తున్నారు. మీరు పార్లమెంట్ సాక్షిగా చరిత్ర వక్రీకరణకు పాల్పడి ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించారు. ఇది మీ కుట్రకు నిదర్శనం. కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారాన్నే నేడు కిషన్ రెడ్డి పార్లమెంట్‌లో చేయడం కాంగ్రెస్, బీజేపీ చీకటి పొత్తుకు సాక్ష్యం. ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ దశల ఎత్తిపోతల ప్రాజెక్టుగా కాళేశ్వరం నిర్మించడం అబద్దమా?. 148 మీటర్ల దిగువ ప్రాంతం నుంచి 618 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయడం అబద్దమా?. ఈరోజు, ఈ నిమిషానికి మండుటెండల్లో సైతం కాళేశ్వరం ప్రాజెక్ట్ కాల్వల ద్వారా జలాలు రైతుల పొలాలకు చేరుతుండటం అబద్దమా? ఏది అబద్దం కిషన్ రెడ్డి?. పంట పొలాల్లో పారుతున్న కాళేశ్వరం జలాలను చూపించేందుకు నేను సిద్ధం వచ్చేందుకు మీకు దమ్ముందా?. మీరు కేబినెట్ మంత్రిగా ఉండి.. ఏ ప్రభుత్వం అయినా ప్రజా ధనంతోనే నిర్మాణాలు చేస్తుందన్న ఇంగితం మరిచి కేసీఆర్ జేబులోంచి డబ్బు ఖర్చు పెట్టారా అని అడగడం మీ అవివేకానికి, అతి తెలివికి నిదర్శనం. మీ బీజేపీ ప్రభుత్వం నిర్మిస్తున్న జాతీయ రహదార్లు, ప్రాజెక్టులకు మీ సొంత పైసలు ఖర్చు పెడుతున్నారా?. ఆ పైసలు దుబాయ్‌లో ముద్రిస్తున్నారా? లేక మీ జేబుల్లో నుండి ఖర్చు చేస్తున్నారా?. కాళేశ్వరం వల్ల ఉపయోగం లేదని గొంతు చించుకున్న కిషన్ రెడ్డి.. గతంలో మీ ప్రభుత్వ పెద్దలే నితిన్ గడ్కరీ నుంచి సిడబ్లుసీ చైర్మన్ మసూద్ వరకు కాళేశ్వరంపై కురిపించిన ప్రశంసలు అబద్దం అంటారా? అవివేకం అంటారా?. నిన్నగాక మొన్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా' (చాప్టర్ 8) రిపోర్ట్ ప్రకారం.. "2014లో తెలంగాణలో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం, 2023 నాటికి ఏకంగా 2.2 కోట్ల ఎకరాలకు పెరిగింది. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ నిర్మించిన 'కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ' పథకాలే" అని కుండబద్దలు కొట్టింది.
ఇది మీ కళ్ళకు కనిపించడం లేదా? రేవంత్ చెప్పింది మాత్రమే చెవుల్లోకి వెళుతుందా?. పూటకో తీరు మాట్లాడటం రాజనీతి అనిపించుకోదు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని, తెలంగాణకు నిధులు కేటాయించాలని మా ఎంపీ సురేశ్ రెడ్డి ఎంతో హుందాగా బాధ్యతగా మాట్లాడితే.. మీరు దాన్ని సమర్థించకపోగా ఉల్టా బాధ్యత మరిచి వ్యర్థ రాజకీయ ప్రేలాపనలకు పాల్పడ్డారు. ఇవాళ పలికింది మీరైనా పలికించింది.. రేవంతు రెడ్డే అన్నది సుస్పష్టం. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి తెలంగాణ వాదాన్ని రెప్రెజెంట్ చేయకుండా సప్రెస్ చేస్తుండటం సిగ్గుచేటు’ అని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.






