‘పీసీ ఘోష్ రిపోర్ట్ ఓ ట్రాష్’.. కాపీలను చెత్త బుట్టలో వేసిన బీఆర్ఎస్

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-31 17:09:46  IST  )

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక(Kaleshwaram Commission Report)పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘పీసీ ఘోష్ రిపోర్ట్ ఓ ట్రాష్’.. కాపీలను చెత్త బుట్టలో వేసిన బీఆర్ఎస్
X

దిశ, వెబ్‌డెస్క్: జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక(Kaleshwaram Commission Report)పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఓ ట్రాష్ అని మండిపడ్డారు. కాపీలను చింపి వేసి చెత్త బుట్టలో వేశారు. అనంతరం అసెంబ్లీ ఎదుట గన్‌పార్కు వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు(Harish Rao) మాట్లాడుతూ.. అసెంబ్లీలో నేను మాట్లాడుతున్నంతసేపు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా అడ్డుపడుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 33 సార్లు అడ్డుకున్నారని మండిపడ్డారు. కావాలనే బీఆర్ఎస్‌పై బుదరజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అందుకే సభ నుంచి బయటకు వచ్చామని చెప్పారు. కాళేశ్వరం కమిషన్‌తో తమపై కక్ష సాధింపులకు పాల్పడుతుందని, ఘోష్​నివేదికలో పూర్తిగా అవాస్తవాలు ఉన్నాయని, ఈ రిపోర్టు చెత్త బుట్టలాంటిందని విమర్శించారు. ఇలాంటి కమిషన్లు దేశంలో ఎన్నో వచ్చాయని అవి ఎక్కడికి వెళ్లాయో కాంగ్రెస్​ నేతలు తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. వరదలతో ప్రజలు అల్లాడిపోతున్న సమయంలో.. ఆదివారం రోజున ఇంత ఆదరబాదాగా చర్చ ఎందుకు ఎందుకని ప్రశ్నించారు.

Next Story