- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Harish Rao: మిల్లా మ్యాగి ఎపిసోడ్ పై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు.. ఆ ఇద్దరితో పాటు ఐఏఎస్ అధికారి!
మిస్ ఇంగ్లాండ్ ఎపిసోడ్ పై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కేసీఆర్ తెలంగాణ పేరును ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తే రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. మిస్ వరల్డ్ (Miss World-2025) ఈవెంట్ లో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగి ఎపిసోడ్ పై ఆయన స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ, ఒక కార్పొరేషన్ చైర్మన్, ఓ ఐఏఎస్ ఆఫీసర్ మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ తో (Milla Maggi) అనుచితంగా ప్రవర్తించారనీ వార్తలు వస్తున్నాయని రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసి వారి పైన చర్యలు తీసుకుని రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టాలన్నారు. తెలంగాణ భవన్ లో రాష్ట్ర అవతరణ దినోత్సం సందర్భంగా పార్టీ నేతలతో కలిసి జాతీయ జెండా, పార్టీ జెండాను ఎగరవేసిన అనతరం ఆయన మాట్లాడారు. అభివృద్ధిలో కేసీఆర్ అగ్రగామి అయితే అబద్ధాలు ఆడటంలో రేవంత్ రెడ్డి అగ్రగామి అని ఇదే ఈ ఇద్దరి మధ్య తేడా అని హరీశ్ రావు ధ్వజమెత్తారు.
సొంతంగానే, ఒంటరిగానే:
బీఆర్ఎస్ పార్టీ బీజేలో విలీనానికి కుట్ర జరుగుతోందని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణల వేళ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సొంతంగానే ఉంటుందని ఒంటరిగానే పోటీ చేస్తుందని హరీశ్ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి 100 సీట్లతో అధికారంలోకి వస్తుందన్నారు. మిమ్మల్ని అర్జంట్ గా గద్దెదించి మేము అధికారంలోకి రావాలనే ఆలోచనలో లేమని కేసీఆర్ ఇదివరకే స్పష్టం చేశారన్నారు. ఇకనైనా రేవంత్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అవతరణ దినోత్సవం స్పీచ్ లో అన్ని అబద్ధాలే అని తన స్పీచ్ లో మహిళా సంఘాలకు రూ. 21 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చానని అబద్దాలు చెప్పారని రూ.21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చినట్లు జీవో కానీ ఏదైనా ఆధారం చూపిస్తే నేను రాజీనామా చేస్తానని రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్ విసిరారు. వడ్డీతో కూడితో కూడిన రుణాలు ఇచ్చి అక్కాచెల్లెళ్లను మోసం చేశారని ధ్వజమెత్తారు.
మీ వెంట ఢిల్లీకి వచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధం:
సచివాలయంకు అంబేద్కర్ పేరు పెట్టినందుకు పోలిస్ కమాండ్ కంట్రోలో సమీక్షలు చేస్తున్నావా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కాదు ఆయన జేజెమ్మలు వచ్చినా కేసీఆర్ ఆనవాళ్లను తొలగించలేరని ఈ భూమి ఉన్నంత వరకు, తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. ఇకనైనా ప్రజాసమస్యలు పట్టించుకోవాలని ముఖ్యమంత్రిగా చరిత్ర హీనుడిగా మిగిలిపోవద్దన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే అఖిలపక్షాన్ని పిలవాలని, అసెంబ్లీని సమావేశపరిచి చర్చ జరపాలన్నారు. అవసరం అయితే ఢిల్లీలో ధర్నా చేసేందుకు నీ వెంట వచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ఈ విషయంలో మీరు పోరాటం చేయకుంటే మేము పోరాటం ఆపబోమన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లి బనకచర్ల ప్రాజెక్ట్ ను అడ్డుకుంటామన్నారు. బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ ను అడ్డుకోవాలన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే రెడ్ బుక్ లో పేర్లు రాసుకుంటామని జాగ్రత్త, రాబోయేది మా ప్రభుత్వమేనని పోలీస్, ఇతర అధికారులను హెచ్చరిస్తున్నామన్నారు.






