- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Harish Rao: కిడ్నాప్‌నకు గురైన చిన్నారుల్లో అధిక శాతం బాలికలే
రాష్ట్రంలోని శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని.. సీఎంగా, హోంమంత్రిగా రేవంత్‌రెడ్డి ఫెయిల్ అయ్యారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ‘ఎక్స్’లో ఫైర్ అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని.. సీఎంగా, హోంమంత్రిగా రేవంత్‌రెడ్డి ఫెయిల్ అయ్యారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ‘ఎక్స్’లో ఫైర్ అయ్యారు. 2024 ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్న వాస్తవాన్ని బయటపెట్టాయని తెలిపారు. దేశంలోనే అత్యధిక సైబర్ నేరాలు నమోదవుతున్న రాష్ట్రంగా తెలంగాణ మారడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. 2024లో తెలంగాణలో 27,230 సైబర్ నేరాలు నమోదయ్యాయని.. ఇది దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో గణనీయమైన శాతమని తెలిపారు. 2023తో పోలిస్తే సైబర్ నేరాలు దాదాపు 49 శాతం పెరగడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. మిస్సింగ్ కేసులు సైతం భయంకరంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2024లో 25,500 మంది మిస్సింగ్ కేసులు నమోదైతే.. ఇప్పటికీ వేలాది మంది ఆచూకీ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ సగటున ఆరుగురు చిన్నారులు అదృశ్యమవుతున్న పరిస్థితి ఉన్నదని తెలిపారు. చిన్నారులపై నేరాలు సైతం భారీగా పెరిగాయని తెలిపారు. 2024లో చిన్నారులపై 6,767 కేసులు నమోదయ్యాయని, కిడ్నాప్‌నకు గురైన చిన్నారుల్లో అధిక శాతం బాలికలేనని.. మహిళలపై నేరాలు పెరిగాయని, 2022లో 22,066 కేసులు ఉండగా 2024లో అవి 24,495కు పెరిగాయని పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా కేసుల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం రాష్ట్ర పోలీస్ వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యంత క్లిష్టమైన కేసులను సైతం వేగంగా ఛేదించే వారని.. ప్రస్తుతం కరీంనగర్‌లో జరిగిన పట్టపగలు నగల దుకాణం దోపిడీ ఘటనలో నిందితులను ఇప్పటికీ పట్టుకోలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని స్పష్టం చేశారు. పట్టపగలు, ప్రజల ముందే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయని, ఐఏఎస్ క్వార్టర్ట్స్‌లో ఐపీఎస్ అధికారి భార్య హత్య వంటి ఘటనలు రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు నిదర్శనమని పేర్కొన్నారు. సీపీ సుమతి నిర్వహించిన ఆపరేషన్ హైదరాబాద్‌లో మహిళల భద్రత ఎంత డొల్లగా మారిందో బయటపడిందని తెలిపారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్షలు నిర్వహించడం కాదని.. క్షేత్ర స్థాయిలో శాంతిభద్రతలను కాపాడటంపై దృష్టి పెట్టాలని సూచించారు.
అన్నదాతతో కాళ్లు మొక్కిస్తున్న ఘనత రేవంత్ సర్కార్‌దే..
దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతులతో అధికారుల కాళ్లు మొక్కిస్తున్న ఘనత రేవంత్ సర్కారుదేనని హరీశ్‌రావు విమర్శించారు. ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటను ప్రభుత్వమే కొనకపోతే ఆ రైతన్నకు దిక్కెవరని ప్రశ్నించారు. కల్లాల్లో రోజుల తరబడి వంటకు కాపలా కాస్తూ, దిగులుతో అన్నదాతలు పిట్టల్లా రాలిపోతుంటే కళ్లప్పగించి చూడటం తప్ప ఈ ప్రభుత్వం చేస్తున్నదేమిటని నిలదీశారు. రైతులను ఆదుకోవాల్సిన పాలకులే ముప్పుతిప్పలు పెట్టి మరణశాసనం రాస్తుంటే, దిక్కుతోచని అన్నదాత ‘నీ బాంచన్ పంట కొనండి’ అని కాళ్లపై పడటం తప్ప ఇంకేం చేయగలడని వేదన వ్యక్తం చేశారు. రైతన్న కన్నీటి శాపం పాలకులను వదలదని హెచ్చరించారు.






