- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళేశ్వరంపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్
కాళేశ్వరంపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాళేశ్వరం(Kaleshwaram Project) అంశం కలకలం రేపుతోంది. సోమవారం కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం తెలంగాణ భవన్ వేదికగా కాళేశ్వరంపై ఆ పార్టీ నేత హరీష్ రావు(Harish Rao) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై బ్రీఫింగ్ ఇవ్వనున్నారు.
కాగా, ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీ.. 650 పేజీల కాళేశ్వరం నివేదికను 60 పేజీల సారాంశంగా తయారు చేసింది. కేబినెట్‌కు సమర్పించిన ఈ సంక్షిప్త నివేదికలో 32 సార్లు కేసీఆర్, 19 సార్లు హరీశ్‌రావు, 5 సార్లు ఈటల రాజేందర్ ప్రస్తావన వచ్చినట్లు సమాచారం.






