నదీ జలాలు - కాంగ్రెస్ ద్రోహాలు.. తెలంగాణ భవన్‌లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్

by Malleboina Mahesh |

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సాగునీటి రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది.

నదీ జలాలు - కాంగ్రెస్ ద్రోహాలు.. తెలంగాణ భవన్‌లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమా రెడ్డి (Minister Uttam Kuma Reddy) పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పిదాలను ఎత్తిచూపారు. వారి పాలనలోనే పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్లక్ష్యానికి గురైందని ఆరోపణలు గుప్పించారు. ఇటు సీఎం సైతం బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సాగునీటి రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా "నదీ జలాలు - కాంగ్రెస్ ద్రోహాలు" అనే అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) ఈ రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)లో సమగ్రమైన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.

కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో గతంలో కాంగ్రెస్ చేసిన పొరపాట్లు, ప్రస్తుతం కేఆర్‌ఎంబీ (KRMB) కి ప్రాజెక్టుల అప్పగింత వంటి అంశాలపై హరీష్ రావు తన పిపిటీలో వివరణ ఇవ్వనున్నారు. ఈ ప్రజెంటేషన్ ద్వారా ప్రధానంగా కృష్ణా నదీ జలాల ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడం వల్ల రాష్ట్రానికి జరిగే నష్టాన్ని ప్రజలకు, పార్టీ శ్రేణులకు వివరించనున్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన ఒప్పందాలు రాష్ట్ర సాగునీటి రంగాన్ని ఎలా దెబ్బతీశాయో గణాంకాలతో సహా నిరూపించేందుకు హరీష్ రావు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు.

Next Story