- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao : రాహుల్ గాంధీకి హరీష్ రావు బహిరంగ లేఖ
హెచ్సీయూ భూవివాదం(HCU Land Issue)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) బహిరంగ లేఖ(Open Letter) రాశారు.

దిశ, వెబ్ డెస్క్ : హెచ్సీయూ భూవివాదం(HCU Land Issue)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) బహిరంగ లేఖ(Open Letter) రాశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేస్తున్న పనుల గురించి తనకు చాలా ఆందోళనగా ఉందని, మీరు చెప్పే సూత్రాలకు వారంతా విరుద్ధంగా పని చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. మీరు రాజ్యాంగాన్ని కాపాడాలని చెబుతారు, కానీ ఇక్కడ మీ పార్టీ ముఖ్యమంత్రి దాన్ని పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల హామీల్లో, పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా చేస్తామని మీరు చెప్పారు కానీ, తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి తమ పార్టీలోకి తీసుకున్నారన్నారు. ఈ విషయంలో సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయడంతో కోర్టు కూడా ఆయన్ని తప్పు పట్టిందని గుర్తు చేశారు.
మీరు బుల్డోజర్లతో ఇళ్లు కూల్చడాన్ని వ్యతిరేకిస్తారని, కానీ.. ఇక్కడేమో పేదల ఇళ్లను HYDRA, మూసీ నది పేరుతో కూల్చేస్తున్నారని, హెచ్సీయూలో 100 ఎకరాల చెట్లను నాశనం చేశారన్నారు. ఎన్నో వన్యప్రాణులకు, నెమళ్లు, ఇతర పక్షుల ఇళ్లు లేకుండా పోయాయని తెలిపారు. HCUలో విద్యార్థులు, ప్రొఫెసర్లపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తే... అందరూ ఈ చర్యను తీవ్రంగా తప్పు పడితే.. కానీ మీ పార్టీ మాత్రమే మౌనంగా ఉందన్నారు. రోహిత్ వేముల మరణం తర్వాత మీరు HCUకి వచ్చి విద్యార్థులకు అండగా ఉంటానని చెప్పారు.. కానీ ఇప్పుడు పోలీసు దాడి జరిగినప్పుడు ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆపమని చెప్పే వరకు ఈ దాడులు ఆగలేదని, HCU విద్యార్థులు, తెలంగాణ ప్రజల తరపున మీరు ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని లేఖలో డిమాండ్ చేశారు.
మీరు అదానీ గ్రూప్‌ను వ్యతిరేకిస్తారు, కానీ ఇక్కడ మీ ముఖ్యమంత్రి వాళ్లను తెలంగాణకు ఆహ్వానిస్తున్నారని, నల్గొండలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం గ్రామాల భూమిని బలవంతంగా తీసుకుంటున్నారని, లగచర్లలో ఆదివాసీ రైతులపై పోలీసులు దాడి చేశారని.. ఏ సందర్భంలో కూడా మీరు ఎందుకు పట్టించుకోలేదన్నారు. మీరు మోడీని వ్యతిరేకిస్తారు, కానీ మీ ముఖ్యమంత్రి ఆయన్ని "బడే భాయ్" అంటున్నారని... ఈ పనులన్నీ మీ సమ్మతితో జరుగుతున్నాయా, లేక మీరు మౌనంగా ఉంటున్నారా? తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వాలని కోరుతున్నానని అన్నారు. మీరు ఈ సమస్యలను సీరియస్‌గా తీసుకుని, మీ ముఖ్యమంత్రికి సరైన దారి చూపాలని కోరుతున్నట్టు హరీష్ రావు తన లేఖలో పేర్కొన్నారు.






