హరీశ్‌రావు మానసిక స్థితి బాగోలేదు.. ఎంపీ చామల స్ట్రాంగ్ కౌంటర్

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-09 10:46:26  IST  )

గ్రూప్-1పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వానికి చెంపపెట్టు అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Kiran Kumar Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

హరీశ్‌రావు మానసిక స్థితి బాగోలేదు.. ఎంపీ చామల స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-1పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వానికి చెంపపెట్టు అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Kiran Kumar Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్-1‌పై వచ్చిన తీర్పుపై హారీష్ రావు అడ్డగోలుగా కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో ఆయన మాన‌సిక ప‌రిస్థితి బాగోలేదని స్పష్టంగా అర్థం అవుతోందని అన్నారు. నీళ్లు, నిధులు, నియ‌మ‌కాల పేరుతో తెచ్చకున్న రాష్ట్రం తెలంగాణ అని.. ప‌దేళ్ల పాటు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) ఏం చేసిందో ప్రజలకు చెప్పాలన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామ‌ని చెప్పి మోసం చేసింది పింక్ పార్టీ కాదా.. అని నిలదీశారు.

అధికారంలో ఉన్న నాడు డీఎస్సీ, గ్రూప్-1, 2, 4 పరీక్షలు కూడా పెట్టని మీరు ఇవాళ గ్రూప్-1 అంశంపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీజీపీఎస్సీ (TGPSC) ప‌రీక్ష పేప‌ర్లు అమ్ముకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ఫైర్ అయ్యారు. జిరాక్స్ సెంట‌ర్ల వ‌ద్ద, ప‌ల్లి బ‌టానీల‌కు ప‌రీక్ష పేప‌ర్లను అమ్ముకోలేదా.. అని ప్రశ్నించారు. పదేళ్ల పాటు ద‌రిద్రపు పాల‌న చేపట్టి.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక త‌ర్వాత‌ డీఎస్సీ ద్వారా 11 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేశామని అన్నారు. గ్రూప్ -1, 2 ప‌రీక్షలను నిర్వహించామని తెలిపారు. ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల‌నే ఆలోచ‌న‌తో తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. గ్రూప్-1 అంశంలో సమస్య పరిష్కారం గుర్తించి మాట్లాడాల్సింది పోయి.. రాజ‌కీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగుల‌కు మంచి చేసే విధంగా టీజీపీఎస్సీ, ప్రభుత్వం క‌లిసి గ్రూప్-1 అంశం సరైన నిర్ణయం తీసుకుంటుందని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

Read More: విద్యార్థుల జీవితాలతో రేవంత్ రెడ్డి చెలగాటం : ఎమ్మెల్యే

Next Story