- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ విజయం వెనుక ఉన్నది కేసీఆర్: హరీష్ రావు
తలసరి ఆదాయం(Per Capita Income)లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలవడంపై బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: తలసరి ఆదాయం(Per Capita Income)లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలవడంపై బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఆర్థిక రంగంలో అసాధారణ విజయం సాధించింది. 2015లో తలసరి జీఎస్‌వీఏ (పర్ క్యాపిటా గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్)లో 9వ స్థానంలో ఉన్న తెలంగాణ, 2024 నాటికి దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఐసీఆర్ఏ ‘స్టేట్ ఎకనామిక్ ట్రెండ్స్ – మే 2025’ నివేదిక వెల్లడించింది. తలసరి ఆదాయం రూ.1.25 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు రెట్టింపు కాగా, 6.8% సీఏజీఆర్‌తో ఈ పురోగతి సాధ్యమైంది.
ఈ విజయం వెనుక కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు(Irrigation Projects), వ్యవసాయ విధానాలు, బలమైన పారిశ్రామిక వృద్ధి ఉన్నాయి. ఇది సమర్థవంతమైన పాలన, ధీటైన ఆర్థిక వ్యూహాలతో తెలంగాణను దేశంలో అభివృద్ధి చిహ్నంగా నిలిపిన సాక్ష్యం అని అన్నారు. అయినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రాష్ట్రాన్ని “దివాలా” రాష్ట్రంగా చిత్రీకరిస్తూ వస్తున్నారు. వాస్తవంగా దివాలా అయింది ఆర్థిక వ్యవస్థ కాదు, ఆయన ఆలోచనలే అని విమర్శించారు. ఈ నిరూపిత విజయాలను విస్మరించి, బీఆర్ఎస్ వేసిన బలమైన పునాదిని కొనసాగించకపోవడం అంటే ప్రజలను తప్పుదారి పట్టించడమే కాదు, తెలంగాణ ప్రగతిని అవమానించడమే. బీఆర్ఎస్ పాలన సాధించిన ఈ ఆర్థిక విజయం దేశానికి స్ఫూర్తిగా నిలుస్తుందని హరీష్ రావు పేర్కొన్నారు.
Telangana’s rise from 9th place in 2015 to India’s No. 1 state in per capita GSVA by 2024 is truly outstanding as per ICRA ( State Economic Trends May 2025 report).
— Harish Rao Thanneeru (@BRSHarish) May 21, 2025
We’ve more than doubled our per capita income from ₹1.25 lakh to ₹3.5 lakh with an impressive 6.8% CAGR.
This… pic.twitter.com/qnHixFSwbB






