- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM రేవంత్ సహా కుంభకోణంలో భాగమైన ఎవరినీ వదలిపెట్టం.. హరీష్ రావు హెచ్చరిక
ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని టూరిజం అభివృద్ధి పేరిట కమీషన్లు దండుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుట్రకు ప్లాన్ చేస్తోందని బీఆర్ఎస్ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని టూరిజం అభివృద్ధి పేరిట కమీషన్లు దండుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుట్రకు ప్లాన్ చేస్తోందని బీఆర్ఎస్ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఏకంగా 15వేల కోట్ల పనులు అప్పనంగా అప్పగిస్తూ మరో స్కాంకు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం తెరలేపిందని అన్నారు. లక్షల కోట్లు విలువజేసే వేలాది ఎకరాల భూములను(Land Scam) తన అనుయాయులకు ధారాదత్తం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
‘‘ఓపెన్ బిడ్లు పిలవలేదు. అధికంగా బిడ్ దాఖలు చేసిన వారికి పనులు అప్పగించాల్సి ఉన్నా ఎక్కడా నిబంధనలు పాటించలేదు. ఇద్దరు, ముగ్గురిని మాత్రమే కన్సల్టెంట్స్‌గా పెట్టుకొని పనులను సీక్రెట్‌గా కట్టబెట్టారు. ఇందులో ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి? ప్రభుత్వ భూములను, ప్రజా ధనాన్ని ఎవరికి దోచి పెడుతున్నారు?. లగ్జరీ వెల్ నెస్ రిసార్ట్స్, వైన్ యార్డు రిసార్ట్స్, లగ్జరీ హోటల్స్, వాటర్ ఫ్రంట్ రిసార్ట్స్, అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు, థీమ్ పార్కుల అభివృద్ధి పేరిట మీరు చేస్తున్నది ముమ్మాటికీ స్కామే.. కమీషన్ల దందానే. ఈ స్కాం సంబంధించిన పూర్తి వివరాలను ఆధారాలతో సహా త్వరలో బయటపెడుతాం’’ అని హరీష్ రావు కీలక ప్రకటన చేశారు.
‘అధికారం శాశ్వతం కాదు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ దోపిడీలో భాగమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదు. ఈ మొత్తం స్కాంపై విచారణ జరిపిస్తాం. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పబ్లిక్ మనీని రికవరీ పెడుతమని హెచ్చరిస్తున్నాం’ అని ప్రకటనలో హరీష్ రావు పేర్కొన్నారు.






