- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్న రేవంత్! ఆశా కార్యకర్తల మహాధర్నాలో హరీశ్‌రావు హాట్ కామెంట్స్
సీఎం రేవంత్ రెడ్డి కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు సెటైర్లు వేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఒక దవఖాన కట్టింది లేదు.. బిల్డింగ్ కట్టింది లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. కానీ బీఆర్ఎస్ ప్రారంభించిన పనులకు రిబ్బన్ కట్ చేసేందుకు కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు సెటైర్లు వేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఆశా కార్యకర్తల (Asha Workers) మహాధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొని హాట్ కామెంట్స్ చేశారు. దమ్ముంటే గన్‌మెన్‌లు లేకుండా, పోలీసులు లేకుండా యూనివర్సిటీకి రా అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. ఆశా కార్యకర్తలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. మీరు ఏ మాటిచ్చారో ఆ మాట నెరవేర్చండి అని అడుగుతున్నారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం హామీని నెరవేరుస్తారా? లేదంటే ఉద్యమించమంటారా? అని ప్రశ్నించారు. మాట తప్పావు రేవంత్ రెడ్డి నీకు నిజాయితీ లేదు.. కోఠిలో హెల్త్ డైరెక్టరేట్ దగ్గర ఆశా కార్యకర్తలను పోలీసులను పెట్టి కొట్టించారని ఆరోపించారు.
మా ఆశాలకు, అంగన్వాడీలకు మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు ఇవ్వమంటే పైసలు ఇవ్వనంటావా? అని నిలదీశారు. మా ఉద్యోగులకు డీఏ, జీపీఎఫ్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి అడిగినా డబ్బులు లేవు అని చెబుతావని అన్నారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం, ఊర్లలో పేదవారికి సేవ చేసే ఆశాలంటే ఎందుకు చిన్న చూపు అని సీఎంను ప్రశ్నించారు. గవర్నమెంట్ ఉద్యోగులతో పాటు.. కేసీఆర్ హయాంలో రూ. 2,200 ఉన్న ఆశా వర్కర్ల జీతాన్ని రూ.10 వేలకు పెంచుకున్నట్లు వివరించారు. రేవంత్ రెడ్డి రేపో మాపో పంచాయతీ ఎలక్షన్లు పెడతా అంటున్నావ్.. స్థానిక ఎన్నికల లోపు ఆశ కార్యకర్తలను పిలిచి మాట్లాడి వారి కోరికలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆశాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చేస్తారో వాళ్లే చేసి చూపిస్తారని హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి ఆశాలు, అంగన్వాడీలు అంటే చిన్నచూపు.. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చారు.






