Harish Rao: రేవంత్ రెడ్డి ఇక ముసుగు తీసి బుద్ధి తెచ్చుకో: హరీశ్ రావు

by Prasad Jukanti |

నిన్నటి మీటింగ్ లో బనకచర్ల ప్రస్తావనపై సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.

Harish Rao:  రేవంత్ రెడ్డి ఇక ముసుగు తీసి బుద్ధి తెచ్చుకో: హరీశ్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిన్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై తెలంగాణలో రాజకీయం రాజుకుంటోంద. ఈ సమావేశంలో బనకచర్ల అంశం చర్చకు రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతుంటే సీఎం చెప్పేవన్ని అబద్ధాలేనని ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఈ క్రమంలో మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. బనకచర్ల చీకటి ఒప్పందాన్ని నిన్న ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడిస్తే, నేడు కేంద్ర ప్రభుత్వం (ఆల్ ఇండియా రేడియో- ప్రసార భారతి) బట్టబయలు చేసిందన్నారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నిన్నటి సమావేశంలో బనకచర్ల అంశంపై చర్చ జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పని చేసే ఆల్ ఇండియా రేడియో న్యూస్ కు సంబంధించి ఆడియో క్లిప్ ను చేర్ చేస్తూ బనకచర్ల గురించి చర్చే జరగలేదని అబద్ధం చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇక ముసుగు తీయాల్సింది నువ్వొక్కడివేనని విమర్శించారు. తెలంగాణకు విష కూటమి బిజేపీ, టీడీపీ, కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ నీటి ప్రయోజనాలను గంపగుత్తగా ఏపీకి తాకట్టు పెడుతూ, ద్రోహం చేస్తున్న రేవంత్ రెడ్డి.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని హరీశ్ రావు అన్నారు. లేకుంటే ప్రజా క్షేత్రంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

Next Story