Harish Rao: హెలికాప్టర్ లేదని ఇరిగేషన్ మంత్రి ఇంట్లో ఉన్నారు: హరీశ్ రావు

by Prasad Jukanti |

8 మంది ప్రాణాల కంటే ఈ సీఎంకు ఎన్నికలే ముఖ్యమా అని హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.

Harish Rao: హెలికాప్టర్ లేదని ఇరిగేషన్ మంత్రి ఇంట్లో ఉన్నారు:  హరీశ్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్ఎల్ బీసీ టన్నెల్ (SLBC Tunnel) ప్రమాదంపై ప్రభుత్వమే రాజకీయం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ (Harish Rao) రావు విమర్శించారు. 8 మంది ప్రాణాల కంటే ఎన్నికలే ఈ సీఎంకు ఎక్కువయ్యాయని అన్నారు. ప్రమాదం జరిగి మూడు రోజులవుతున్న రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అక్కడికి వెళ్లలేదని.. హెలికాప్టర్ లో సీఎం ఎన్నికల ప్రచారానికి వెళ్తే హెలికాప్టర్ లేదని ఇరిగేషన్ మంత్రి ఇంట్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. రెస్కూ ఆపరేషన్ కంటే ఈ సీఎంకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎక్కువయ్యాయన్నారు. సోమవారం ఓ మీడియా చానల్ తో మాట్లాడిన హరీశ్ రావు.. ఈ ఘటన చాలా దురదృష్టకరం అని ఎస్ఎల్ బీసీ సొరంగం వద్ద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం అయిందని దుయ్యబట్టారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) చేసిన వ్యాఖ్యలను హరీశ్ రావు ఖండించారు. సరైన జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం, కాంగ్రెస్ తొందరపాటు వల్లే ఈ ప్రమాదం సంభవించిందన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో మూడు ప్రాజెక్టుల్లో ప్రమాదాలు జరిగాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కంటే రూ.600 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఎస్ఎల్ బీసీ కోసం ఖర్చు చేసిందన్నారు. మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగుబాటుకు గురైతే ఇదేదో భారీ అవినీతి అని విమర్శించారు. ఇప్పుడు ఎస్ఎల్ బీసీ టన్నెల్ కూలిపోతే ఇది మానవ తప్పిదం కాదు ప్రకృతి వైఫరిత్యం అని మాట్లాడుతున్నారు. మీకైతే ఓ నీతి మాకైతే మరో నీతా అని కాంగ్రెస్ ను ప్రశ్నించారు. కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కూలితే హడావుడిగా ఎన్డీఎస్ఏ బృందాన్ని పంపింన కేంద్ర ప్రభుత్వం ఎస్ఎల్ బీసీ పై ఎంక్వైరీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

Next Story