- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాటలు కోటలు దాటితే సరిపోదు.. చేతలు కూడా ఉండాలి: CM రేవంత్‌పై హరీష్ రావు సెటైర్
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘పంట బీమా అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదర గొట్టిన రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాలుగు సీజన్లుగా పంట బీమా అమలు చేయకపోవడం సిగ్గుచేటు. మాటలు కోటలు దాటితే సరిపోదు.. ఆచరణ కూడా గడప దాటాలి. ఎన్నికలు వస్తే హామీలు గుప్పించడం, అధికారంలోకి వచ్చాక ‘మొండిచేయి’ చూపడం హస్తం పార్టీకి అలవాటుగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, రోట్లో తలపెట్టిన చందంగా రైతుల పరిస్థితి మారింది. అభయ హస్తం మేనిఫెస్టో, వరంగల్ రైతు డిక్లరేషన్‌లో అనేక హామీలు గుప్పించారు. అమలు చేయాలని డిమాండ్ చేస్తే మాత్రం’ వ్యక్తిగత దూషణలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.
‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమం ఆధారంగా చేసుకొని రాష్ట్రంలో పంట బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తాం అని ఇప్పటి వరకు ప్రవేశ పెట్టిన మూడు బడ్జెట్ ప్రసంగాల్లోనూ (ఓటాన్ అకౌంట్ తో సహా) చెప్పారు. గత బడ్జెట్‌లో రూ.1300 కోట్లు కేటాయించి, కేవలం కాగితాలకే పరిమితం చేసారు తప్ప రూపాయి విదిల్చింది లేదు. అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు పంటల బీమాకు అతీగతీ లేక పోవడం కాంగ్రెస్ మార్కు రైతు వ్యతిరేక విధానానికి నిదర్శనం. నిజంగా పంట బీమా అమలు చేయాలనే చిత్తశుద్ది గనక ఉంటే, మే, జూన్ నెలల్లోనే టెండర్లు పిలవాల్సి ఉంది. కానీ ఆ ప్రక్రియ ఇప్పటికీ చేపట్టక కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తున్నది. అకాల వర్షాలు, వడగండ్లు, ఇతర విపత్తులు వచ్చిన ప్రతిసారి సాయం అందక రైతన్నలు మరింత చితికిపోతున్నారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి, ఎన్నికల మేనిఫెస్టోలో, బడ్జెట్ ప్రసంగాల్లో పంట బీమా అమలు చేస్తామని చెప్పిన మాటను నిలుపుకోవాలని, యూరియా కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం’ అని హరీష్ రావు ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.






