- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Harish Rao: ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు? అసెంబ్లీ వాయిదాపై హరీశ్ రావు ఫైర్
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు వాయిదా వేయడంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫర్ అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు (Telangana Assembly Session 2025) ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం అయిన వెంటనే కేబినెట్ భేటీ నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) విజ్ఞప్తితో సభను స్పీకర్ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అసెంబ్లీ వాయిదా వేయడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే (Harish Rao) మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు.
అసెంబ్లీ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా వేయటం ఏమిటని ఎక్స్ వేదికగా నిలదీశారు. కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతున్నదని, సబ్జెక్ట్, నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు కోరడం హాస్యాస్పదమని విమర్శించారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు, నేడు పాలక పక్షంలో ఉన్న ప్రిపేర్ కాలేదు, ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు? కాంగ్రెస్ పార్టీని ట్యాగ్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.






