- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబేద్కర్ హౌజ్‌కు వెళ్లిన హరీష్ రావు
బీఆర్ఎస్ కీలక నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) ప్రస్తుతం లండన్(London) పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ కీలక నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) ప్రస్తుతం లండన్(London) పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. కుమార్తె ఉన్నత చదువుల కోసం కాలేజీలో చేర్పించేందుకు హరీష్ రావు లండన్ వెళ్లారు. అయితే గురువారం లండన్‌లోని అంబేద్కర్‌ను హౌజ్(Ambedkar House)ను హరీష్ రావు సందర్శించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సందర్శన ఫొటోలను స్వయంగా హరీష్ రావే సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. ఇదిలా ఉంటే.. హరీష్ రావుపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేస్తు్న్న విషయం తెలిసిందే. కాళేశ్వరంలో జరిగిన అవినీతికి హరీష్ రావే కారణమని ఆరోపించారు. హరీష్ రావు, సంతోష్ రావుల వల్ల తన తండ్రి కేసీఆర్ చిక్కుల్లో పడ్డారని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే కవిత ఆరోపణలపై హరీష్ రావు ఇప్పటివరకు స్పందించలేదు. అంశంలో ఆయన స్పందన ఎలా ఉంటుందనేది బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రాష్ట్ర రాజకీయ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






