- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Harish Rao: గ్రామాల్లో ఏపీఓలు, పారిశుధ్య కార్మికుల జీతాలు చెల్లించట్లేదు : ఎక్స్‌లో హరీశ్ రావు
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన ఉపాధి హామీ ఏపీవో కమ్మగాని శ్రీనివాస్ జీతాలు రాకపోవడంతో పాటు పని ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన ఉపాధి హామీ ఏపీవో కమ్మగాని శ్రీనివాస్ జీతాలు రాకపోవడంతో పాటు పని ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) స్పందించారు. ఉపాధి హమీ ఏపీఓలకు మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం శోచనీయం అని పేర్కొన్నారు. చేసిన పనికి వేతనాలు రాక ఉపాధి హమీ సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కుటుంబ పోషణ భారమై సతమతమవుతుంటే ఈ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి మనోవేదనకు గురై ఉపాధి హామీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం విచారకరమని ఆవేదన చెందారు. మరోవైపు (sanitation workers) పారిశుధ్య కార్మికులకు కూడా వేతనాలు రాక గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందన్నారు. ఎన్నికల సమయంలో హామీలతో ఊదరగొట్టిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏమని సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి.. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉపాధి హామీ ఏపీవోలు, పారిశుధ్య కార్మికుల పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.






