- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని హారీష్ రావు చెప్పడం బ్లాక్ మెయిల్ రాజకీయాలు : విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మించి 20 లక్షల మంది ఉపాధి కల్పించాలని సీఎం రేవంగ్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని, ఫ్యూచర్ సిటీ నిర్మాణం అయితే తమ ఉనికి గల్లంతు అవుతుందని బీఆర్ఎస్ భయపడుతోందని ప్రభుత్వ విప్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు.

- ఎంత వరకైనా దిగజారుతానని ఆయన రుజువు చేసుకున్నారు
- పారిశ్రామిక వేత్తలను భయపెట్టడమే ఆయన ఉద్దేశం
- అమెరికా వెళ్లి తెలంగాణ పరువు తీస్తున్నారు
- ఫ్యూచ్ సిటీ నిర్మాణంతో తమ ఉనికి గల్లంతని బీఆర్ఎస్ భయపడుతోంది
- ఎన్ని చేసినా ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదు
దిశ, తెలంగాణ బ్యూరో : 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మించి 20 లక్షల మంది ఉపాధి కల్పించాలని సీఎం రేవంగ్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని, ఫ్యూచర్ సిటీ నిర్మాణం అయితే తమ ఉనికి గల్లంతు అవుతుందని బీఆర్ఎస్ భయపడుతోందని ప్రభుత్వ విప్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం సీఎల్పీ మీడియా సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లడుతూ హరీష్ రావు అమెరికా వెళ్లి తెలంగాణ పరువు తీస్తున్నారని, ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామని చెప్పి ఆయన బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. పారిశ్రామిక వేత్తలను భయపెట్టడమే హరీష్ రావు ఉద్దేశమని, ఇంత కంటే దారుణం ఏమైనా ఉంటుందా..ఆయన ఎంత వరకైనా దిగజారుతానని రుజువు చేసుకున్నారని ఫైర్ అయ్యారు. అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు ఫ్యూచర్ సిటీకి వచ్చి పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నారని, హారీష్ రావు ఎంత విష ప్రచారం చేసినా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైనే కంపెనీలకు విశ్వాసం ఉంటుందని, వారిని అడ్డుకోవడానికే హరీష్ రావు మాట్లాడుతున్నారని యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.
తెలంగాణ భవిష్యత్తు గొంతు కోసేలా హరీష్ రావు తీరు ఉందని, మన దగ్గర పెట్టుబడులు పెట్టండి అని ప్రతిపక్షాలు కూడా అంటాయని, తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ నాడు పెట్టబడులు రావొద్దని చెప్పలేదన్నారు. లక్షలాది మంది యువత కలలను దెబ్బతీయాలన్నదే హరీష్ రావు ఆలోచన అని, అధికారంలోకి వస్తామని ఆయన కలలు కంటున్నారని యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఫార్మా సిటీలో గ్రీన్ ఫార్మా జోన్, లైఫ్ సైన్స్ జోన్ ను ఏర్పాటు చేస్తున్నామని, కాలుష్యం లేని ఫార్మా సంస్థల ఏర్పాటుకు ఆహ్వానిస్తున్నాం..తెలంగాణ నడిబొడ్డున కాలుష్యం నింపాలని మేం అనుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ ప్రజలు కాలుష్యం కోరల్లో పడి చనిపోవాలని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారని యెన్నం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. మహానగరాన్ని తయారు చేసుకోవాలని తాము గొప్ప ఆలోచిస్తున్నామని, ఫ్యూచర్ సిటీకి బందర్ పోర్టుతో కనెక్టివిటి ఏర్పాటు చేస్తే అనేక పరిశ్రమలు వస్తాయని యెన్నం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. తెలంగాణ యువత దుబాయ్ కి, ముంబయి కి వలస పోవాలని కల్వకుంట్ల కుటుంబం చూస్తోందని, స్టేడియంలో కూర్చుని బాక్సింగ్ రింగ్ లో కొట్టుకుంటుంటే చూసి ఆనందించే మనస్థత్వం ఆ కుటుంబానిదని ఆయన ఘాటు విమర్శలు సంధించారు. వీరి వికృత చేష్టలను చూసే కల్వకుంట్ల ఆడ బిడ్డ కవిత బయటకు పోయిందని, బీఆర్ఎస్ పార్టీ సచ్చిన శవంతో సమానమని యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.






