బాల్క సుమన్ అరెస్ట్.. రేపు ఆదిలాబాద్ జైలుకు హరీశ్ రావు

by Ajay Maddhiboyina |

బాల్క సుమ‌న్ అరెస్ట్ ను హ‌రీష్ రావు ఎక్స్ వేధిక‌గా ఖండించారు. క్యాతనపల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకు మాజీ శాసనసభ్యులు, దళిత నాయకుడు బాల్క సుమన్ ను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని అన్నారు.

బాల్క సుమన్ అరెస్ట్.. రేపు ఆదిలాబాద్ జైలుకు హరీశ్ రావు
X

దిశ‌, వెబ్ డెస్క్: మంత్రి వివేక్ కాన్వాయ్ పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే బాల్క‌ సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు మంచిర్యాల ఫస్ట్ క్లాస్ జూనియర్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులో బాల్క సుమన్ ఏ1గా ఉండగా, రాజిరెడ్డి ఏ2, దోమకొండ అనిల్ ఏ4, రామిడి లక్ష్మి కాంత్ ఏ8గా ఉన్నారు. సుమన్ తో పాటు మరో ముగ్గురికి మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో సుమన్ ను ఆదిలాబాద్ జైలుకు తరలించారు. ఇక సుమ‌న్‌ను పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు ఆదిలాబాద్ వెళ్లనున్నారు.

మ‌రోవైపు సుమ‌న్ అరెస్ట్ ను హ‌రీష్ రావు ఎక్స్ వేధిక‌గా ఖండించారు. క్యాతనపల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకు మాజీ శాసనసభ్యులు, దళిత నాయకుడు బాల్క సుమన్ ను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని అన్నారు. క్యాతన్ పల్లిలో బీఆర్ఎస్ కి పూర్తి మెజారిటీ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన తీరు చూసి యావత్ తెలంగాణ అసహ్యించుకుంటున్నద‌ని విమ‌ర్శించారు. అధికార బలం, పోలీసు బలం, ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అని మండిప‌డ్డారు.

Next Story