Harish Rao: రేపు లండన్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి రానున్న హరీశ్‌రావు.. కవిత అంశంపై ఆసక్తి!

by Ramesh Naini |   (  Updated:2025-09-05 17:32:07  IST  )

బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు లండన్ నుంచి రేపు ఉదయం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగనున్నట్లు సమాచారం.

Harish Rao: రేపు లండన్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి రానున్న హరీశ్‌రావు.. కవిత అంశంపై ఆసక్తి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) విదేశీ పర్యటన ముగిసింది. గత సోమవారం హరీశ్‌రావు యూకే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన లండన్ నుంచి రేపు ఉదయం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగనున్నట్లు సమాచారం. హైదరాబాద్ చేరకున్న అనంతరం ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఫామ్‌హౌస్‌కు హరీశ్‌రావు వెళ్లనున్నట్లు తెలిసింది. అక్కడ కేసీఆర్ సహా కేటీఆర్‌లతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ భేటీలో కాళేశ్వరంపై సీబీఐ విచారణ, కవిత అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలపై హరీశ్‌రావు ఏ విధంగా స్పందిస్తారనేది పోలిటికల్ సర్కిల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే కవిత అంశంపై కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. కాళేశ్వరం అవినీతికి బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, జోగినపల్లి సంతోష్ రావు కారణమని కవిత ఆరోపణలు చేయడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది.

Next Story