- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల ముందు పోలీసులు బైండోవర్ చేసేది రౌడీలనే కదా? హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు
ఎన్నికల ముందు పోలీసులు బైండ్ ఓవర్ చేసేది రౌడీలనే కదా? అని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల ముందు పోలీసులు బైండోవర్ చేసేది రౌడీలనే కదా? అని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉదయం ఎర్రగడ్డ మోతి నగర్ వాసవి బృందావనం అపార్ట్మెంట్ వాసుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఎన్నిక లేడీ వర్సెస్ రౌడీ మధ్య జరుగుతుందని అన్నారు. వాళ్లది రౌడీ కుటుంబం కాకపోతే పోలీస్ స్టేషన్లో నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులను ఎందుకు బైండోవర్ చేశారని ప్రశ్నించారు. బైండోవర్ చేసిన వాళ్లని రౌడీ అనకపోతే ఏమంటారని అన్నారు. సునీతమ్మ ఒక్కరు కాదని, సునీతమ్మ వెంట కేసీఆర్, మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఉందని అన్నారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు మార్చుకోవాల్సి వస్తుందన్నారు. ఈ రోజు ప్రజలందరూ మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన విధ్వంసాన్ని సరి చేయాలంటే మళ్ళీ ఇంకెంత సమయం పడుతుందో అని చెప్పుకొచ్చారు.
హైదరాబాదులో బీఆర్ఎస్ ప్రభుత్వం 43 ఫ్లైఓవర్లు నిర్మించిందని, రెండు సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఒక్క చిన్న రోడ్డు అయినా వేశారా? అని విమర్శించారు. గత పది సంవత్సరాల పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అన్న నానుడిని మార్చి తెలంగాణ ఆచరిస్తది దేశం అనుసరిస్తది అన్నట్టుగా కేసీఆర్ పాలన సాగిందన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం, మోడీ ఆదర్శంగా తీసుకొని హర్ ఘర్‌కు జల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తుకు చేశారు. 8 ఏళ్లయినా హర్ ఘర్ కు జల్ కార్యక్రమాన్ని కేంద్రం పూర్తి చేయలేదని విమర్శించారు. కేసీఆర్ రాకముందు హైదరాబాదులో ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కునే పరిస్థితి ఉండేదన్నారు. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేసీఆర్ చేపట్టారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుందన్నారు.
ఎంతో నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో, సంక్షేమంలో ముందుకు నడిపించారు కేసీఆర్. సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా రోజుల తర్వాత హైదరాబాదుకు వచ్చి ఇది హైదరాబాదా..? న్యూయార్క్ నగరమా..? అన్నంతగా ఆశ్చర్యపోయానని వారే చెప్పారని గుర్తుకు చేశారు. కేసీఆర్ పాలనలో ఇండస్ట్రియలిస్ట్ పెట్టుబడి పెట్టడానికి లైన్ కడితే కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం రైతులు లైన్ లో నిల్చుంటున్నారని మండిపడ్డారు. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిపోయిందన్నారు. పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు భూమి అమ్ముదామంటే ధర లేక నష్టపోతున్నారని తెలిపారు. హైడ్రా పేరుతో ఇండ్లు కూలగొట్టి భయభ్రాంతులకు గురిచేశారని, రియల్ ఎస్టేట్ పర్మిషన్లకు, నిర్మాణాలకు ముఖ్యమంత్రి కమీషన్లు డిమాండ్ చేయడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటుందని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ పర్మిషన్లకు, నిర్మాణ పర్మిషన్లకు 30% కమీషన్ డిమాండ్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.






