- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిల్లలకు అన్నం పెట్టలేని ప్రభుత్వం అవసరమా? సీఎం రేవంత్‌ని నిలదీసిన హరీశ్‌రావు
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లు అని డబ్బా కొట్టుకునే సీఎం రేవంత్ రెడ్డి ముందు ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు పురుగులు లేని అన్నం పెట్టు అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లు అని డబ్బా కొట్టుకునే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముందు ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు పురుగులు లేని అన్నం పెట్టు అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు పురుగులన్నం పెట్టిన ఘటనపై స్పందించారు. ముఖ్యమంత్రి గారు.. ఇక నుంచి నేనే సమీక్షలు చేస్తానన్న మీ మాటలేమయ్యాయి? విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకే అన్న బెదిరింపులేమయ్యాయి? రెండేళ్లలో మీ వద్దనే ఉన్న విద్యాశాఖపై ఎన్ని సార్లు సమీక్షలు చేశారు? విద్యార్థులకు కల్తీ ఆహారం పెడుతున్న ఎంత మందిని జైలుకు పంపారు? అని హరీశ్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు.
మీ మాటలకు విలువ లేదు, ఆచరణకు దిక్కులేదు.. అని ఆయన విమర్శించారు. బడిలో చదువుకోవాల్సిన విద్యార్థులు.. పురుగులన్నం మాకొద్దు అని రోడ్లెక్కి నిలదీస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా అసలు నువ్వేం చేస్తున్నట్లు? అని నిలదీశారు. చిల్లర మాటలు.. చీప్ పాలిటిక్స్.. స్కీంలు లేవుగానీ.. ఎందులో చూసినా స్కాంలు, అందిన కాడికి దండుకునే ప్లాన్లు.. వాటాలు, కమీషన్ల కోసం మీటింగులు.. అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే కదా 23 నెలలుగా నువ్వు చేస్తున్నది రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. బడి పిల్లలకు సరిగ్గా అన్నం పెట్టలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండి ఏం లాభం? అని విమర్శించారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు పురుగులన్నం పెట్టిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ట్వీట్ ఇదే..






