- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao : రేవంత్ రెడ్డికి దేవాదుల, బనకచర్ల ఏ బేసిన్లో ఉన్నాయో కూడా తెలియదు : హరీష్ రావు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) మరోసారి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై తీవ్ర ఆరోపణలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) మరోసారి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రం గురించి, రాష్ట్రంలోని ప్రాజెక్టుల గురించి అస్సలు అవగాహన లేదని విమర్శించారు. బుధవారం సచివాలయంలో బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla)పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూ.. దేవాదుల(Devadula), బనకచర్ల ఏ బేసిన్లో ఉందని ఉత్తమ్ కుమార్ ను అడిగారని, దీనిని బట్టి రేవంత్ కు తెలంగాణ ప్రాజెక్టుల మీద కనీస అవగాహన లేదన్నారు. 23 ఏళ్ల క్రితం గోదావరి బేసిన్లో ప్రారంభమైన దేవాదుల వివరాలే తెలియని సీఎం.. ఇక ఢిల్లీకి వెళ్ళి, సుప్రీంకోర్టుకు వెళ్ళి ఏపీ ప్రాజెక్టుల మీద కొట్లాడతాననడం హాస్యాస్పదం అన్నారు.
చంద్రబాబు నాయుడు జల దోపిడిని అడ్డుకోమంటే.. సమావేశం పెట్టిమరీ అబద్దాలు చెప్పారని తెలిపారు. కాళేశ్వరానికి కేబినెట్ ఆమోదం లేదని ప్రకటించడం దుర్మార్గం అని, కేబినెట్ భేటీలో గ్రీన్ సిగ్నల్ వచ్చాకే ప్రాజెక్టుపై ముందుకు వెళ్లామని.. తమపై ఏదోక రకంగా బురద జల్లడం తప్ప మరేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి విషయం తక్కువ విషం ఎక్కువ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజంటేషన్ అని, కేసీఆర్ ను తిట్టి చంద్రబాబు మెప్పు పొందే ఆరాటం సీఎంలో కనబడుతోందని హరీష్ రావు మండిపడ్డారు. కృష్ణా బేసిన్ లో రాష్ట్రానికి 763 TMCల వాటా దక్కాలని బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ముందు కేసీఆర్ పోరాడితే.. రేవంత్ మాత్రం 500 TMCలు ఇస్తే చాలు అంటున్నారని, దీనివల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని అన్నారు. తెలంగాణ హక్కులు ఏపీ సీఎంకు ధారపోస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.






