- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: బనకచర్లపై హరీశ్ రావు పీపీటీ.. చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు
బనకచర్లపై ఏపీ ముందుకు వెళ్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని హరీశ్ రావు విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కృష్ణా జలాల తరహాలోనే గోదావరి జలాలను చెరబట్టేందుకు ఏపీ ప్రభుత్వం బనకచర్ల రూపంలో కుతంత్రం చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు. బనకచర్లతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఇప్పటి వరకు నకచర్లపై అఖిలపక్ష సమావేశం పెట్టలేదని విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్ లో బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన హరీశ్ రావు.. ఓవైపు ఈ ప్రాజెక్ట్ కోసం ఈ నెలాఖరులో టెండర్లు పిలిచేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం అవుతుంటే నిధులు, నిధులు ఆంధ్రాకే అన్నట్టుగా డిల్లీ పాలకులు వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణలోని ఇద్దరు కేంద్ర మంత్రులు నోరుమెదపడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిపక్షాలను ఇర్రిటేట్ చేసే ఉద్దేశమే తప్ప ఇరిగేషన్ మీద శ్రద్ధ లేదని బనకచర్ల ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వం నిర్మిస్తుంటే మన ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు ఉందన్నారు. కృష్ణా జలాలను అక్రమంగా తరలించడానికి పోతిరెడ్డిపాడు ఎలా మారిందో గోదావరి జలాలను తరలించుకుపోవడానికి బనకచర్ల అలా ఉపయోగపడుతోందన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే తెలంగాణ సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిద్రపోతోందని, ఉత్తమ్ కుమార్ ఉత్తిత్తి మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని పక్క రాష్ట్ర నాయకత్వానికి తాకట్టుపెడ్డారు. బనకచర్లపై మీ మౌనానికి అర్థం ఏంటని నిలదీశారు. 2 టీఎంసీల బాబ్లీ కోసం చంద్రబాబు 2008లో పెద్దపోరాటం చేశారు. 200 టీఎంసీలతో అక్రమ ప్రాజెక్టు కడుతుంటే ఎంత పోరాటం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి తెలంగాణ ప్రజల వాయిస్ ను ఢిల్లీకి వినిపిద్ధామని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ముందుకురాకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రజా పోరాటానికి, న్యాయపోరాటానికి రూపకల్పన చేస్తామని హెచ్చరించారు.
చంద్రబాబు చెప్పేవి అబద్ధాలు:
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఆపాలని చంద్రబాబు లేఖరాస్తే పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి నిశబ్ధంగా ఉన్నారు. గోదావరి, కృష్ణానదులపై ఏ ప్రాజెక్టు కట్టాలన్నా అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉండాలని విభజన చట్టంలో ఉంది. కానీ ప్రాజెక్టు కట్టి గోదావరి ట్రైబ్యూనల్ ముందు ఎక్కువ వాటా పొందడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బనకచర్ల వల్ల తెలంగాణకు నష్టం లేదు అని చంద్రబాబు చెప్పిన మాటలు అబద్ధం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని ఆనాడు చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, కల్వకుర్తి, నెట్టింపాడు, సుంకిశాళ ప్రాజెక్టులపై చంద్రబాబు ఫిర్యాదులు చేశారు.






