- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Harish Rao: ఇదేనా రాహుల్‌గాంధీ మొహబ్బత్ కి దుకాన్? ఎక్స్ మాజీ మంత్రి హారీశ్‌రావు పోస్ట్
బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) ఇంటిపై కాంగ్రెస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) తెలిపారు. గురువారం ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రతిపక్ష నాయకుల ఇండ్లపై దాడి చేయడం కాంగ్రెస్ పాలనలో సర్వ సాధారణం కావడం దుర్మార్గమన్నారు. గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తే, ఇండ్లపై దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. ఇదేనా రాహుల్ గాంధీ చెబుతున్న మొహబ్బత్ కి దుకాన్? పిలుపునిచ్చి మరీ ప్రతిపక్ష నాయకుల ఇండ్లపై దాడులు చేస్తుంటే, పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్లు.. ప్రశ్నించారు. డీసీసీ అధ్యక్షుడు పిలుపుతో జరిగిన ఈ దాడిలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరిని అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవోకు తెలంగాణ డీజీపీ ట్యాగ్ చేశారు.






