- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆల్రెడీ CM రేవంత్‌కు లెటర్ రాశా.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ది బురద రాజకీయం అని మండిపడ్డారు. మా మీద కోపంతో కాళేశ్వరం(Kaleshwaram Project) మోటర్లు ఆన్ చేయడం లేదని సీరియస్ అయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు నష్టం జరుగుతుందని అన్నారు. వర్షాల వల్ల నదులకు భారీగా వరదలు వచ్చాయి.. ఒక్కరోజులో ఎస్సారెస్పీ నిండుతుంది.. అయినా మిడ్ మానేరుకు ఇంకా నీరు ఎందుకు వదలడం లేదు అని హరీష్ రావు ప్రశ్నించారు. రిజర్వాయర్ల విషయంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) లెటర్ రాశానని అన్నారు. సాగునీరు సముద్రం పాలు చేస్తున్నారని చెప్పినా.. ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా సాగునీటి విలువ తెలియదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ మీదున్న కోపంతో రైతులను ఆగం చేయొద్దు.. తక్షణమే ప్రాజెక్టుల నుంచి నీరు వదలాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం పంపులు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలని కోరారు.






