- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KCR: హైకోర్టులో షాక్.. ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో హరీశ్ రావు భేటీ
కాళేశ్వరం కమిషన్ నివేదిక బయటకు వస్తే కేసీఆర్ ఇబ్బందులు తప్పవా?

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై స్టే ఇవ్వలేమంటూ హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) తో హరీశ్ రావు (Harish Rao) భేటీ అయ్యారు. ఇవాళ హరీశ్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు. అక్కడ కేసీఆర్ తో హరీశ్ రావు సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టు విచారణ నేపథ్యంలో ఈ తదుపరి చర్యలపై చర్చిస్తున్నట్లు సమాచారం. కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం నివేదికపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి 3 వారాల గడువు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్, హరీశ్ రావు భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
రిపోర్టు బయటకొస్తే నష్టమేంటి?:
కాళేశ్వరం కమిషన్ నివేదిక విషయంలో కేసీఆర్, హరీశ్ రావు చేస్తున్న ఆరోపణలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాశం అవుతున్నాయి. ఈ రిపోర్టును కేసీఆర్ ఎందుకు రద్దుచేయాలని కోరుతున్నారనే అంశం ఆసక్తి రేపుతోంది. జస్టిస్ పీసీ ఘోష్ (Justice PC Ghosh) ఇచ్చిన నివేదిక బయటకు వస్తే నిజంగానే కేసీఆర్ కు నష్టం మాటిళ్లబోతున్నదా అనేదానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రిపోర్టును అడ్డు పెట్టుకుని తమ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే నివేదికను రద్దు చేయాలని కేసీఆర్ చేస్తున్న వాదన సరికాదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను లీగల్ గా తప్పు అని నిరూపించాల్సింది పోయి ఇలా నివేదికను అడ్డుకోవాలనుకోవడం సరికాదని అంటున్నారు. మధ్యలోనే ఎస్కేప్ అవ్వాలని చూస్తే రాజకీయంగా క్రెడిబులిటీ దెబ్బతినే అవకాశం ఉందని ఇది అంతిమంగా ప్రత్యర్థులకే ఆయుధంగా మారుతుందని సూచన చేస్తున్నారు.






