Gajwel: ఇద్దరు కానిస్టేబుళ్ల మృతిపై హరీష్ రావు దిగ్భ్రాంతి

by Gantepaka Srikanth |
Gajwel: ఇద్దరు కానిస్టేబుళ్ల మృతిపై హరీష్ రావు దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌(Gajwel) పట్టణంలోని జాలిగామ బైపాస్‌లో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు(Police Constables) మృతిచెందిన విషయం తెలిసిందే. రాయపోలు పీఎస్‌లో పనిచేసే పరందాములు, దౌల్తాబాద్‌ పీఎస్‌లో పనిచేసే వెంకటేశ్‌ మృతిచెందినట్లు పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్‌లో జరిగే మారథాన్‌లో పాల్గొనేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తాజాగా.. ఈ ప్రమాదంపై బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) స్పందించారు. కానిస్టేబుళ్ల మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. కానిస్టేబుళ్ల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story