- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలన్నదే హరీష్ రావు ఆలోచన : విప్ బీర్ల ఐలయ్య
హరీష్ రావు రైతుల పేరుతో రెచ్చగొట్టి ధర్నాలు చేస్తున్నారని, రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలన్నదే హరీష్ రావు ఆలోచన అని ప్రభుత్వ విప్, బీర్ల ఐలయ్య ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : హరీష్ రావు రైతుల పేరుతో రెచ్చగొట్టి ధర్నాలు చేస్తున్నారని, రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలన్నదే హరీష్ రావు ఆలోచన అని ప్రభుత్వ విప్, బీర్ల ఐలయ్య ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారం కోల్పోయిన అక్కసుతో రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు నెలల పాటు ధాన్యం కొనుగోలు చేయకపోతే ధాన్యం మొలక్కెత్తిన విషయాన్ని మరిచిపోయారా అని ఆయన విమర్శించారు. హరీష్ రావు దొంగ ధర్నాలను రైతులు నమ్మరని, ఈ రైతులే గోరి కట్టి మమ్మల్ని ఇంట్లో కూర్చొబెట్టారు..కేసీఆర్ సుద్దపూసలా ఫామ్ హౌస్ లో కూర్చుని రైతులను రెచ్చగొడుతున్నారని బీర్ల ఐలయ్య విమర్శించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం రైతన్నలకు పెద్ద పీఠ వేస్తోందని, రాష్ట్రంలో 8 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు మూడు వేల కోట్ల రూపాయలను రైతులకు బోనస్ గా ఇచ్చామని, రైతు సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారని బీర్ల ఐలయ్య మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారని, ప్రతి గింజను మా ప్రభుత్వం కొనుగోలు చేస్తామన్నారు.






