- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొలం గట్టుపై కూర్చొని రైతులతో ముచ్చటించిన హరీష్ రావు
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఆదివారం పర్యటించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా పొలాల వద్ద సద్ది తింటున్న మొక్కజొన్న రైతుల(Telangana Farmers)తో హరీష్ రావు ముచ్చటించారు. యూరియా కోసం రేవంత్ రెడ్డి మమ్మల్ని తిప్పలు పెట్టాడని, అందరిని ఆగం చేశాడని, సన్న బియ్యంతో అన్నం ముద్ద అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేసినట్లు హరీష్ రావు చెప్పుకొచ్చారు. కాళేశ్వరం రంగనాయక సాగర్ నిర్మించిన తర్వాత నీళ్ల ఇబ్బందులు పోయాయని.. రెండు పంటలు కాదు మూడు పంటలు పండిస్తున్నామంటే మీరు తెచ్చిన కాళేశ్వరం నీళ్ళే అంటూ అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారని హరీష్ రావు అన్నారు. అనంతరం వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని.. రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయని రైతులతో హరీష్ రావు చెప్పారు. వీడియో
Next Story






