బాంబులు పెట్టారని సిగ్గులేకుండా మాటలు.. హరీశ్‌రావుకు ఆది శ్రీనివాస్ కౌంటర్

by Ramesh Naini |

కాళేశ్వరంపైన బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు సోయి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

బాంబులు పెట్టారని సిగ్గులేకుండా మాటలు.. హరీశ్‌రావుకు ఆది శ్రీనివాస్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరంపైన బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు (Harish Rao) సోయి లేకుండా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆనాడే తుమ్మిడి హట్టి దగ్గర బ్యారేజ్ కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా? కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసింది మీరు కాదా? అని నిలదీశారు. మీ హయాం లోనే మేడిగడ్డ కూలింది హరీశ్‌రావు.. గుర్తు లేదా అంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు. కూలినప్పుడే పోలీసు‌‌లు ఎఫ్ఐఆర్ చేశారని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేయోద్దని చెప్పిందని గుర్తుకు చేశారు. (Kaleshwaram) కాళేశ్వరం కట్టింది మీ హయాంలోనే.. కూలింది కూడా మీ హయాంలోనే అంటూ మండిపడ్డారు.

కాంగ్రెస్ (Congress) వాళ్లు బాంబులు పెట్టారని, కుట్ర చేశారని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. మీ అవినీతి అక్రమాల వల్లనే కాళేశ్వరం కూలిందని ఆరోపించారు. కాళేశ్వరం తెలంగాణకు గుదిబండలా మారిందని తెలిపారు. మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసి ఆ బ్యారేజ్ కొట్టుకుపోయి మా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని హరీశ్‌రావు మాట్లాడుతున్నారని ఆరోపించారు. మేం అన్ని ప్రాజెక్ట్ లు నింపుతాం.. రైతులకు నీళ్లు ఇస్తాం.. నువ్వు బురద రాజకీయాలు మానుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు మీరు మీ పార్టీ ని చక్కదిద్దుకోండని హితువు పలికారు. ఎప్పుడు నీళ్లు నింపాలి, ఎప్పుడు వదలాలి మా సీఎం రేవంత్ రెడ్డికి తెలుసని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.

Next Story