- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: ఇలా ఎంతమందిపై కేసులు పెట్టుకుంటూ వెళ్తారు రేవంత్ రెడ్డి గారు?: హరీశ్ రావు
రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కక్షసాధింపు చర్యలు మానుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హెచ్‌సీయూ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసినందుకు విద్యార్థులు (HCU Students), బీఆర్‌ఎస్ (BRS) నాయకులు, సోషల్ మీడియా వారియర్స్‌పై అక్రమ కేసులు (Illegal Cases) బనాయించారని ఆరోపించారు. ఇవాళ నల్లగొండ జిల్లా మర్తినేని గూడెం మాజీ సర్పంచ్ బండమీది రామును అక్రమంగా పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇలా ఎంతమందిపై కేసులు పెట్టుకుంటూ వెళ్తారు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) గారు?’ అని నిలదీశారు. ఈ మేరకు ఇవాళ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసిన హరీశ్‌రావు.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఇదేం ఇందిరమ్మ రాజ్యం? అని ప్రశ్నించారు. మీ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదని, అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదని, ఎక్కడికక్కడ ప్రజాక్షేత్రంలో నిలదీసి మీ వైఫల్యాలను ఎండగడతూనే ఉంటామని హెచ్చరించారు.






