- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: రేవంత్ సర్కార్‌పై SEBIకి ఫిర్యాదు చేసిన హరీశ్‌రావు
హైదరాబాద్‌లోని కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై మాజీ మంత్రి హరీశ్ రావు సెబీకి ఫిర్యాదు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని కంచె గచ్చిబౌలి (Kanche Gachibowli) భూముల వివాదంపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సెబీకి ఫిర్యాదు చేశారు. వాస్తవాలు దాచిపెట్టి, నిబంధనలను ఉల్లంఘిస్తూ కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి రుణాలు సమీకరించడం సెబీ నిబంధనలకు విరుద్ధమంటూ సెబీ (SEBI) చైర్మన్‌కు హరీశ్ రావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన గురువారం పూర్తి వివరాలు, ఆధారాలతో సెబీకి లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం సెబీ నిబంధనలను ఉల్లంఘించిందని పలు చట్టాలను హరీశ్ రావు లేఖలో పేర్కొన్నారు.
1. సెబీ (మోసపూరిత, అన్యాయమైన వాణిజ్య పద్ధతుల నిషేధం) నిబంధనలు, 2003 ప్రకారం భౌతిక వాస్తవాలను తప్పుగా చూపడం, మోసపూరితంగా దాచిపెట్టడం నేరం.
2.సెబీ (నాన్-కన్వర్టిబుల్ సెక్యూరిటీల జారీ, జాబితా) నిబంధనలు, 2021 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తప్పుడు నివేదికలు చూపుతూ సెబీ నీ తప్పుదారి పట్టించే ప్రయత్నం.
3.సెబీ (లిస్టింగ్ ఆబ్లిగేషన్స్, బహిర్గత అవసరాలు) నిబంధనలు, 2015 ప్రకారం కంపెనీల నిర్మాణ మార్పులను, ఆర్థిక వివరాలను తప్పకుండా వెల్లడించాల్సిన బాధ్యత ఉంది కానీ తెలంగాణ ప్రభుత్వం టీజీఐఐసీ వెల్లడించకపోవడం.
4.సెబీ (మర్చంట్ బ్యాంకర్లు) నిబంధనలు, 1992 ప్రకారం మధ్యవర్తులు తగిన జాగ్రత్తలు తీసుకుని నిజాలను వెల్లడించకపోవడం.
5.సెబీ యాక్ట్, 1992 సెక్షన్ 11(2)(i) ప్రకారం సెబీకి తప్పుడు సమాచారం, మోసపూరిత లావాదేవీలు చేయడం.
6.సెబీ (ఎల్‌ఓడీఆర్) నిబంధనలు, 2015 సెక్షన్ 4(2)(e) ప్రకారం పెట్టుబడిదారులకు పూర్తి, స్పష్టమైన సమాచారం అందించడం తప్పనిసరి కానీ తెలంగాణ ప్రభుత్వం అందుకు భిన్నంగా వాస్తవాలను దాచిపెట్టింది.
7.కంపెనీల చట్టం (కంపెనీల చట్టం, 2013) సెక్షన్ 13, 14 ప్రకారం ప్రైవేట్ కంపెనీని పబ్లిక్ కంపెనీగా మార్చడానికి సరైన విధి విధానాలు పాటించకపోవడం
8. ఆర్థిక స్థితి, అప్పుల చెల్లింపు సామర్థ్యం గురించి సరైన వివరాలు వెల్లడించకపోవడం సెబీ చట్టంలోని సెక్షన్ 15A, 15హెచ్ఏ ఉల్లంఘనే.






