- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాయిచంద్ విగ్రహావిష్కరణ సభలో హరీష్ రావు ఎమోషనల్
తెలంగాణ మలిదశ ఉద్యమ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సాయిచంద్ రెండవ వర్థంతి నేడు అమరచింతలో జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మలిదశ ఉద్యమ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సాయిచంద్ రెండవ వర్థంతి నేడు అమరచింతలో జరిగింది. ఈ సందర్భంగా సాయిచంద్ ఏడడుగుల కాంస్య విగ్రహాన్ని బస్టాండ్‌లో ఏర్పాటు చేశారు. కాగా విగ్రహాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. అనంతరం సాయిచంద్ చదువుకున్న స్కూల్ గ్రౌండ్‌లో భారీ బహిరంగసభను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆయనను గుర్తు చేసుకుని సాయిచంద్ సతీమణి మాజీ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్ పర్సన్ రజినీ సాయిచంద్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమెతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. సాయిచంద్ ఉద్యమం సమయంలోనే కాకుండా పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత కూడా ప్రతి సభలో ఆయన పాటలను వినిపించారు. ముఖ్యంగా కేసీఆర్ సభ ఉందంటే కచ్చితంగా సాయిచంద్ ముందుగా పాటలు పాడి జనాల్లో జోష్ నింపేవారు. ప్రస్తుతం బీఆర్ఎస్ సభల్లో ఆయన లోటు కనిపిస్తుందని చాలామంది అభిప్రాయపడుతుంటారు. వీడియో






