- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి.. మాజీ మంత్రి హరీశ్‌రావు కీలక డిమాండ్స్

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు. ఆదివారం సిద్దిపేట పట్టణ కేంద్రంలో శ్రీ కృష్ణ యాదవ ఫంక్షన్ హాల్ సభ్యులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఫంక్షన్‌లకు వచ్చే డబ్బులను పేద విద్యార్థుల ఖర్చు చేయాలని సూచించారు. (KCR) కేసీఆర్ ఉన్నప్పుడు యాదవుల గొప్పతనం అసెంబ్లీలో చెప్పారని, యాదవులకు ఎన్నో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారని గుర్తుకు చేశారు. కానీ కాంగ్రెస్ (Congress) నాయకులు వారికి ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు.
కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. (caste census) కులగణన పేరుతో దొంగ సర్వే చేశారు.. బీసీ సంఖ్యలను తగ్గించారు.. అని ఆరోపించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 42 శాతం సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. (CM Revanth Reddy) రేవంత్ రెడ్డి ఏ ఒక్క కులానికి న్యాయం చేయలేదని, 42 శాతం రిజర్వేషన్ తెచ్చిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో కేంద్ర బడ్జెట్‌లో గుండు సున్నా ఇచ్చారని, బీజేపీ, కాంగ్రెస్ గెలిచినా ప్రయోజనం ఏమి లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దోచుకొని ఢిల్లీకి పంపుతున్నడని ఆరోపించారు. రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కూడా రేవంత్ రెడ్డికి దొరకడం లేదని అన్నారు. కేసీఆర్ తెలంగాణ ఆత్మ గౌరవం నిలబెట్టారు.. రేవంత్ రెడ్డి తెలంగాణ గౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. భూమి పని కావాలంటే, మంత్రులకు 30 శాతం కమీషన్ కావాలంట.. భూమాత కాదు.. భూమేత అయిందని ఆరోపించారు. తెలంగాణలో మంత్రులకు, ఎమ్మెల్యేకు కమీషల్‌ల మధ్య గొడవలు జరుగుతున్నవని ఆరోపించారు.