- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Harish Rao: రేవంత్ రెడ్డి మొదటి మాటే తుస్సుమంది: హరీష్ రావు
ఈ కాంగ్రెస్ పాలనలో జరిగిందల్లా ఆర్గనైజ్డ్ కరప్షనే అని హరీశ్ రావు విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రేవంత్ రెడ్డి (Revanth Reddy) బిల్డప్ బాబాయ్ అని ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్క రోజు మాత్రమే ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నాడని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. నాలుగైదు రోజులు మంత్రులు వచ్చారని ఆ తర్వాత వీళ్ళు కూడా పత్తా లేరని దుయ్యబట్టారు. వచ్చే దరఖాస్తులను పట్టించుకున్న నాథుడు లేడని దుయ్యబట్టారు. కనీసం వచ్చే దరఖాస్తులను పట్టించుకున్న నాథుడు లేడని, ప్రజాభవన్‍ను జల్సాలు, విందులు, వినోదాలకు వేదికగా మార్చారని ఆరోపించారు. ఆరు గ్యారెంటీల్లో మొదటి గ్యారెంటీనే ఇప్పటి వరకు అమలు జరగలేదని, మహాలక్ష్మీ స్కీమ్ కే ఇంకా దిక్కు లేదన్నారు. మేనిఫెస్టోలోని మొదటి కార్యక్రమం, రేవంత్ రెడ్డి మొదటి మాటే తుస్సుమందని ఎద్దేవా చేశారు. ఇవాళ తెలంగాణ భవన్‍లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో హామీలు, అభివృద్ధి ఏదీ జరగలేదని విమర్శించారు.
జరిగిందల్లా ఆర్గనైజ్డ్ కరప్షనే:
ఈ పాలనలో జరిగిందల్లా ఆర్గనైజ్డ్ కరప్షన్ అంటూ హరీశ్ రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నిస్సారం, నిష్ఫలం, నిరర్ధకం అన్నారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ పాలన ఇది అని దుయ్యబట్టారు. ప్రజాభవన్‍ను జల్సాలు, విందులు, వినోదాలకు వేదికగా మార్చారని విమర్శించారు. కేసీఆర్ ప్రారంభించిన స్కీములన్నీ అటకెక్కించారని ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వంలో కొత్త ట్యాక్సు కట్టాల్సి వస్తోందని ప్రతి స్కీమ్‍లోనూ స్కాం ఉందన్నారు. కోటి మంది అక్కాచెల్లెల్లలో ప్రతీ ఒక్కరికీ రూ. 60 వేలు బాకీ పడ్డారని విమర్శించారు. ఈ పాలనలో ఆత్మహత్యలు మర్డర్లు, అత్యాచారాలు పెరిగాయన్నారు.






