- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైక్రోబ్రూవరీల ఆలోచన మానుకో.. రేవంత్ రెడ్డి నువ్వు ఓ యూ టర్న్ సీఎం.. హరీశ్‌రావు తీవ్ర విమర్శలు
ఆదాయం పెంచుకునేందుకు అడ్డదారులు వెతుక్కుంటున్న రేవంత్ సర్కార్.. ప్రజలపై పన్నుల భారం మోపుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆదాయం పెంచుకునేందుకు అడ్డదారులు వెతుక్కుంటున్న (Revant Govt) రేవంత్ సర్కార్.. ప్రజలపై పన్నుల భారం మోపుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ఆరోపించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా తెలంగాణ సీఎంపై తీవ్ర విమర్శలు చేశారు. 6 గ్యారంటీలు 420 హామీల ఊసు లేదు కానీ మద్యం ఆదాయం రెట్టింపు చేసుకునే దిశగా కొత్త పాలసీ తెచ్చారని, కేసీఆర్ తెచ్చిన పథకాలకు కోతలు, ప్రజలకు పన్నుల వాతలు తప్ప 22 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఇప్పటికే మద్యం ధరలను ఇష్టారీతిగా పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) ఆదాయాన్ని మరింత పెంచుకునే విధంగా కొత్త పాలసీ తెచ్చిందని తెలిపారు. ఇప్పుడు మద్యం షాపుల దరఖాస్తు ఫీజును ఏకంగా రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలకు పెంచారన్నారు.
ప్రజలపై ఆర్టీసీ బస్సు చార్జీల మోతలు, వాహనాలపై పన్నుల భారం మోపారు, ఆర్ఆర్ టాక్స్‌లు వేశారని తెలిపారు. ప్రజలకు సంక్షేమం పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చి గద్దె నెక్కగానే గరీబోళ్ల సంపాదనను కొల్లగొట్టే పథకాలు రచిస్తున్నారని ఆరోపించారు. బెల్ట్ షాపులు ఎత్తివేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ దాన్ని తుంగలో తొక్కి గ్రామ గ్రామాన మద్యం ఏరులై పారేలా చేసిందన్నారు. మద్యం అమ్మకాలు టార్గెట్ రీచ్ కాలేదని అధికారులకు మెమోలు ఇచ్చిన ఘనత రేవంత్ సర్కార్‌దన్నారు. పల్లె పల్లెకు మద్యం చేర్చడంపై ఉన్న శ్రద్ధ పల్లె పల్లెకు వైద్యాన్ని అందించడంపై లేదని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం బ్రాండ్లను విచ్చలవిడిగా అనుమతించి మద్యం ఆదాయం పెంచుకోవాలనే స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిందన్నారు.
వందలకొద్దీ కొత్త బ్రాండ్లు వస్తున్నాయి అంటున్నారు.. అడ్డగోలుగా బ్రాండ్లను పెంచి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతారా? అని ప్రశ్నించారు. యూరియా ఇవ్వరు కానీ ఊరి ఊరికో మద్యం దుకాణం ఇస్తాం తీసుకోండి అంటోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పబ్బులు, క్లబ్బుల గురించి గబ్బుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. పబ్బులకు అనుమతి రద్దు చేయకపోగా కొత్త పబ్బులకు పర్మిషన్ ఇస్తూ కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి నువ్వు ఓ యూ టర్న్ సీఎం.. ఎన్నికల్లో చెప్పింది ఒకటి ఇప్పుడు చేస్తున్నది మరొకటి.. (Microbrewery) మైక్రోబ్రూవరీల మూర్ఖపు ఆలోచన మానుకో రేవంత్ అని హరీశ్‌రావు సూచించారు.






