- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Harish Rao: ఎవరూ అధైర్యానికి లోనుకావద్దు.. తొందరపడొద్దు
ఆర్టీసీ కార్మికుల పోరాటానికి తామంతా అండగా ఉంటామని.. అధైర్య పాడొద్దని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ‘ఎక్స్’లో భరోసా ఇచ్చారు. కలిసికట్టుగా, న్యాయబద్ధంగా పోరాడి హక్కులను సాధించుకుందామని పిలుపునిచ్చారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ కార్మికుల పోరాటానికి తామంతా అండగా ఉంటామని.. అధైర్య పాడొద్దని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ‘ఎక్స్’లో భరోసా ఇచ్చారు. కలిసికట్టుగా, న్యాయబద్ధంగా పోరాడి హక్కులను సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని విన్నవించారు. శంకర్‌గౌడ్ ఆత్మబలిదానం తమ హృదయాలను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. శంకర్‌గౌడ్ మృతికి సీఎం రేవంత్‌రెడ్డిదే బాధ్యత అని.. ఈ ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని తెలిపారు. అధికారంలోకి రాగానే ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తిచేస్తామని, ఇతర అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మాట తప్పడంవల్లనే ఈ దుస్థితి వచ్చిందని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు సైతం అమలు చేయకుండా ఇంకెన్నాళ్లు కాలం గడుపుతారు రేవంత్‌రెడ్డి? అని ప్రశ్నించారు. ఎంతమందిని బలి తీసుకుంటారని నిలదీశారు. కార్మికుల న్యాయమైన ఆవేదనను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. శంకర్‌గౌడ్ అమరుడైన రోజును అప్పాయింటెడ్ డేగా ప్రకటించి ఆయన త్యాగానికి తగిన గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు.







