- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: ఎముకలు కొరికే చలిలో వాళ్ల బాధ చూస్తుంటే..
Harish Rao: ఎముకలు కొరికే చలిలో వాళ్ల బాధ చూస్తుంటే..

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డికి సావు భాష తప్ప సాగు గురించి సోయి లేదని.. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రైతుల బతుకులు ఇలా క్యూ లైన్లలో తెల్లారాల్సిందేనని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ‘ఎక్స్’లో మండిపడ్డారు. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు కష్టాల పడుతున్నారని పేర్కొన్నారు. ‘అందరినీ తొక్కుకుంటూ వచ్చాను’ అని గర్వంగా చెప్పుకునే రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ చెత్త పాలనతో ఇప్పుడు రైతులనే తొక్కుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీ చిల్లర రాజకీయాలకు, నీ విధ్వంసకర పాలనకు బలైపోతున్నది రైతే. రైతులకు సమయానికి యూరియా కూడా అందించలేని నువ్వు ముఖ్యమంత్రివా?’ అని ప్రశ్నించారు. యూరియా కొరత కనిపించకుండా మసిపూసి మారేడుకాయ చేయడానికి తెచ్చిన యూరియా యాప్ ఏమైందని నిలదీశారు. యాసంగి సీజన్ ఆరంభంలోనే రైతులకు యూరియా కష్టాలు మొదలైతే, ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చుంటే, రైతులు మాత్రం తెల్లవారుజాము నుంచే ఎముకలు కొరికే చలిలో చెప్పులు క్యూలో పెట్టుకుని యూరియా కోసం ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా మార్పు అని ప్రశ్నించారు. గత సీజన్‌లో ఎదురైన యూరియా కొరత చేదు అనుభవాల నుంచి ఈ ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం తెలంగాణలో యూరియా సమస్య తీరదా? అని నిలదీశారు.






