‘డీజిల్‌కు కూడా డబ్బులు లేవు’.. హరీష్ రావు ఆసక్తికర ట్వీట్

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-15 11:11:45  IST  )

రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.

‘డీజిల్‌కు కూడా డబ్బులు లేవు’.. హరీష్ రావు ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘బిల్లులు ఇవ్వట్లేదని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ బంద్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులు ఆపేయడంతో కాలేజీలు బంద్.. విద్యార్థులకు నిరుద్యోగ భృతి బంద్, జాబ్ క్యాలెండర్ బంద్, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు బంద్.. నిధుల లేక గ్రామాల్లో పారిశుధ్యం బంద్.. డీజిల్ పోయించేందుకు కూడా డబ్బులు లేక చెత్త ఎత్తే ట్రాక్టర్లు బంద్. రైతులకు రుణ మాఫీ బంద్, పంట బోనస్ బంద్, వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా బంద్.. పంట పండిద్దామంటే చివరకు అన్నదాతకు యూరియా బంద్.. 22 నెలల కాంగ్రెస్ పాలనలో సంక్షేమం బంద్, అభివృద్ధి బంద్.. ఎక్కడ చూసినా బందు, బందు, బందు’ అని హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చేతగాని, దద్దమ్మ పాలనను చూసి అన్ని వర్గాల ప్రజలు విసిగి వేసారి పోయారని అన్నారు. అందుకే కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ నేతల డ్రామాలను బంద్ పెట్టే రోజులు ఇక దగ్గర్లోనే ఉన్నాయని హరీష్ రావు ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story