ఇక్కడొక్కచోటే కాదు.. తెలంగాణ మొత్తం ఇదే దుస్థితి: హరీష్ రావు ఆసక్తికర ట్వీట్

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-21 14:41:29  IST  )

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం అకాల వర్షం కురిసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేకచోట్ల రైతులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇక్కడొక్కచోటే కాదు.. తెలంగాణ మొత్తం ఇదే దుస్థితి: హరీష్ రావు ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం అకాల వర్షం కురిసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేకచోట్ల రైతులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం నీటితో తడిసిముద్దయ్యాయి. ఈ పరిస్థితిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) స్పందించారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ మేరకు నెట్టింట్ ట్వీట్ పెట్టారు. ‘అకాల వర్షాలకు అన్నదాత ఆగమైతుంటే, ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీళ్ల పాలైతే, పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు. కామారెడ్డి జిల్లా, బీబీపేట్ మండలం, యాడారం గ్రామ రైతుల పరిస్థితి మాత్రమే కాదు.. దాదాపు రాష్ట్రమంతా ఇదే దుస్థితి నెలకొంది. తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని, రైతుల బతుకులు కాపాడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)ని కోరుతున్నాం’ అని హరీష్ రావు ఎక్స్‌లో పేర్కొన్నారు.

మరోవైపు ఇప్పటికే వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని అన్నారు.

Next Story