- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: మైనార్టీల గౌరవాన్ని పెంచింది కేసీఆర్
గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల కోసం రూ.3,300 కోట్లు కేటాయించి రూ.1,000 కోట్లలోపే ఖర్చు చేసిందని.. ఈసారి బడ్జెట్‌లో కోత పెట్టిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల కోసం రూ.3,300 కోట్లు కేటాయించి రూ.1,000 కోట్లలోపే ఖర్చు చేసిందని.. ఈసారి బడ్జెట్‌లో కోత పెట్టిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బంజారాహిల్స్‌లోని లేక్ వ్యూ ఫంక్షన్ హాల్‌లో మన్నే గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హరీశ్‌రావు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహమూద్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో మైనార్టీ సభ్యుడిగా మంత్రిగా అవకాశం ఇచ్చారని, మైనార్టీల గౌరవాన్ని పెంచింది కేసీఆర్ అని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో నీళ్లు కూడా లేక హైదరాబాద్ బస్తీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. రంజాన్ పండుగకు రంజాన్ తోఫాతోపాటు ఇఫ్తార్ విందు ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇఫ్తార్ విందులను అధికారికంగా నిర్వహించలేదని, రంజాన్ తోఫా కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తెచ్చిన టేమరిస్ పాఠశాలలను ఇంటిగ్రేటెడ్‌లో కలపడానికి కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.






