- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ణుడివి కాదు.. కుంభకర్ణుడివి.. సీఎంపై హరీశ్ రావు విమర్శలు
రైతుబంధు అమలు చేయకుండా రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ అభివృద్ధికి కేరాఫ్ అయితే కాంగ్రెస్ సర్కార్ విధ్వంసానికి కేరాఫ్ అని రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడటం మీద ఉన్న ధ్యాస రైతుల కష్టాల మీద లేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించి, అభివృద్ధి అంటే ఏంటో కేసీఆర్ దేశానికి చూపిస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలవుతున్నా.. రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి శూన్యం అన్నారు. ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన హరీశ్ రావు.. హైడ్రా పేరుతో హైదరాబాద్‍లో, మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పేదల ఇండ్లను కూలగొడుతూ వారి బతుకులను ఆగం చేస్తున్నారని దుయ్యబట్టారు. కట్టడం చేతకాని రేవంత్ రెడ్డికి కూలగొట్టే హక్కు ఎక్కడిది? అని నిలదీశారు.
కర్ణుడివే అయితే రైతుబంధు ఏది?
తనను తాను కర్ణుడితో పోల్చుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్ణుడు కాదు.. మహా క్రూరుడు అని హరీశ్ రావు విమర్శించారు. కర్ణుడు మాట తప్పని వాడు, తన కవచ కుండలాలను సైతం దానం చేసిన త్యాగధనుడు. కానీ రేవంత్ రెడ్డి పేదల గుండెల మీద తన్నే దుర్మార్గుడని విమర్శించారు. ఖమ్మంలో పేదల ఇండ్లు కూలగొడుతుంటే ఆ విధ్వంసం, వారి కన్నీళ్లు చూసి బందోబస్తుకు పోయిన ఒక ఎస్సై సైతం కన్నీరు పెట్టుకున్నాడు. దేశం మొత్తం ఆ వీడియోలు చూసి చలించిపోయింది. కానీ, ముఖ్యమంత్రికి మాత్రం కనీసం వీసమెత్తు కూడా బాధ కలగలేదన్నారు. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను దారుణంగా మోసం చేశారన్నారు. కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చితే నేడు రేవంత్ పాలనలో రైతుబంధు ఎగ్గొడుతున్నారన్నారు. మీరు నిజంగా కర్ణుడే అయితే రైతుబంధు ఎందుకు ఎగ్గొడుతున్నారు? 24 గంటల కరెంటు, ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయరు? అని సీఎంను ప్రశ్నించారు.
ఎన్నికలు రాగానే నిద్రలేవడం అవ్వగానే నిందలు వేయడం..
నిజం చెప్పాలంటే నువ్వు కర్ణుడివి కాదు.. కుంభకర్ణుడివి. ఎన్నికలు రాగానే నిద్రలేస్తావు. ఎన్నికలు అవ్వగానే కేసీఆర్ మీద, బీఆర్ఎస్ నేతల మీద నిందలు వేస్తూ కాలక్షేపం చేస్తావని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు రైతుబంధు పడుతుందంటావు.. ఎన్నికలు కాగానే ఎగ్గొడతావు. నేను రుణమాఫీ చేసిన, రైతుబంధు వేసిన.. అవి పడ్డాయో లేదో నాకు తెలవదు అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. నువ్వు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రివా? లేక చప్రాసీవా? కేసీఆర్ పాలనలో కరోనా కష్టకాలంలో కూడా రైతుల ఫోన్‍లలో రైతుబంధు డబ్బులు టింగు టింగు మని మోగాయి. రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడటం మీద ఉన్న ధ్యాస, ఒక్కనాడు కూడా రైతుల కష్టాల మీద లేదు. 99 రోజుల ప్రణాళిక అంటూ ముఖ్యమంత్రి మళ్లీ కొత్త నాటకానికి తెరతీశారు. ఏ ముఖం పెట్టుకుని మళ్లీ 99 రోజుల ప్రణాళిక అని ప్రజల ముందుకు వస్తున్నారు? అని ప్రశ్నించారు.






