Harish Rao: ప్రెజెంటేషన్ ఇస్తామంటే భయం ఎందుకు? మంత్రికి హరీశ్‌రావు కౌంటర్

by Ramesh Naini |

అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి హరీశ్‌రావు మీడియా చిట్‌చాట్‌లో మంత్రి శ్రీధర్ బాబుకు కౌంటర్ ఇచ్చారు.

Harish Rao: ప్రెజెంటేషన్ ఇస్తామంటే భయం ఎందుకు? మంత్రికి హరీశ్‌రావు కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ సమావేశాల్లో (Kaleshwaram Project) కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం అంశంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కానీ దీనిపై రేవంత్ సర్కార్ అనుమతి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే శనివారం శాసనసభ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) మీడియా చిట్‌చాట్‌లో (Minister Sridhar Babu) మంత్రి శ్రీధర్ బాబుకు కౌంటర్ ఇచ్చారు. మేము కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ (PowerPoint presentation) ఇస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం ఎందుకు? అని ప్రశ్నించారు. వాస్తవాలు ప్రజలకు వివరిస్తాం కదా.. ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయనే పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు.

కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు పీపీటీ అంశంపై శాసనసభ వ్యవహారాల ఇంఛార్జి, మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తప్పులు చేసింది వారికి మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు అని మంత్రి నిలదీశారు. సభలో ఎవరికైనా ఆర్డర్ ప్రకారం మాట్లాడడానికి అవకాశం ఇస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

Next Story