- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Harish Rao: ఉత్తమ్‍కు సీఎం రేవంత్ రెడ్డి గాలి సోకినట్లుంది.. హరీశ్ రావు కౌంటర్
పాలమూరు ప్రాజెక్టుపై గ్రీన్ ట్రిబ్యునల్‍లో కోర్టులో కేసు వేసి అడ్డుకున్న ద్రోహి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని హరీశ్ రావు విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త మాటలు మాట్లాడుతున్నారని ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి గాలి సోకినట్లుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‍రావు (Harish Rao) ఎద్దేవా చేశారు. ఉత్తమ్‍కు (Uttam Kumar Reddy) రేవంత్ రెడ్డి (Revanth Reddy) సావాస దోషం పట్టుకుందన్నారు. ఇవాళ అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన హరీశ్‍రావు.. పాలమూరు ప్రాజెక్టు కోసం నేల మీద పడుకుని పనిచేశాననన్నారు. ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళించామని 90 టీఎంసీలను 45టీఎంసీలకు తగ్గించారా లేదా? ఉత్తమ్ చెప్పాలన్నారు. డీపీఆర్ వాపస్ వచ్చి ఏడాది అయినా మౌనం ఎందుకు? అని ప్రశ్నించారు. మా హయాంలో ఏడు అనుమతులు తెచ్చామని మరి ఈ రెండేళ్లలో ఒక్క అనుమతైనా తెచ్చారా? అని నిలదీశారు. పాలమూరు ద్రోహులు కాంగ్రెస్ నేతలు అని దుయ్యబట్టారు.
కేసులు వేసి అడ్డుకున్న ద్రోహి ఉత్తమ్:
గ్రీన్ ట్రిబ్యునల్‍లో కోర్టులో కేసు వేసి అడ్డుకున్న ద్రోహి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని రెండు టన్నల్స్ బీఆర్ఎస్ హాయాంలోనే పూర్తి అయ్యాయన్నారు. మిస్టర్ ఉత్తమ్ మీ చేతకాని తనాన్ని మాపై రుద్దుతున్నారు. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ కు రెండేళ్ల క్రితం కొబ్బరికాయ కొట్టి డీపీఆర్ ఎందుకు పంపలేదు? అని నిలదీశారు. సొంత శాఖపై మంత్రిగా ఉత్తమ్‍కు ఇంకా పట్టు రానట్టుంది. ఇంకెప్పుడు జ్ఞానం పెంచుకుంటాడో అని సెటైర్ వేశారు. ఎస్ఎల్బీసీ బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1900కోట్లు ఖర్చు పెట్టింది. ఏడు ప్రాజెక్టులకు ఢిల్లీ నుంచి ఫైనల్ అనుమతులు తెచ్చాం.కాంగ్రెస్ హాయంలో 3 డీపీఆర్ లు వాపస్ వచ్చాయన్నారు.
మాకూ పీపీటీకి చాన్స్ ఇవ్వాలని అడిగాం:
సభను కనీసం 15రోజులు జరపాలని బీఏసీలో పట్టు పట్టాంమని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సభను వారం రోజులు జరుపుతామని స్పీకర్ చెప్పారని వారం తర్వాత మళ్ళీ బీఏసీ పిలుస్తామన్నారని తెలిపారు. నదీ జాలలపై సభలో బీఆర్ఎస్ కూడా పీపీటీకి అవకాశం ఇవ్వాలని బీఏసీలో లేవనెత్తామన్నారు. కాంగ్రెస్ వచ్చాక క్వశన్ అవర్ 6రోజులు మాత్రమే పెట్టారు. ప్రతి రోజు క్వశన్ అవర్ పెట్టాలని కోరినట్టు చెప్పారు. అలాగే ఖాళీగా ఉన్న 16హౌస్ కమిటీలు వేయాలని కోరామని, ఎజెండా పంపే పద్దతి సరిగా లేదని 24గంటల ముందే అజెండా ఇవ్వాలని కోరామన్నారు. 15అంశాలపై సభలో చర్చించాలని పట్టు పట్టినట్లు తెలిపారు.






